AP Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలివిడతలో ఎన్నికలు జరగనున్న 3,967 పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. అటు పెండింగ్ మున్సిపాలిటీలు, కొర్పారేషన్ల నామినేషన్లు రెండో రోజు కొనసాగాయి. అయితే పంచాయతీ నామినేషన్ల తొలిరోజు పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
పల్నాడు జిల్లా..
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇసప్పాలెంలో నామినేషన్ వేసేందుకు ములకలూరు వైసీపీ వర్గీయులు వందల సంఖ్యలో వచ్చారు. నిబంధనల ప్రకారం నామినేషన్ వేసేందుకు ముగ్గురినే అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో.. వైసీపీ వర్గీయులు అక్కడే బైఠాయించారు. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న టీడీపీ నేతలు, వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.
అన్నయ్య జిల్లా..
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సిబ్యాలలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. గరుగుపల్లి, పెమ్మాడపల్లికి చెందిన వైసీపీ మద్దతుదారులు సిబ్యాలలోని సచివాలయంలో నామినేషన్ వేసేందుకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు వచ్చారు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఒక్కసారిగా రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు.
శ్రీకాకుళంలో బీజేపీ నేత..
శ్రీకాకుళంలో బీజేపీ నేత చల్లా వెంకటేశ్వర రావు, ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసుల పైకి కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో సీఐ, ఎస్సైకు గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చల్లా వెంకటేశ్వర రావు కూతురు సంజన గ్రీస్మా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి గా మూడు కూటమి పార్టీలతో పాటు.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం సంచలనంగా మారింది.
ఘర్షణల మధ్యే నామినేషన్ల పర్వం
ఓవరాల్‌గా ఏపీలో ఘర్షణల మధ్యే నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈనెల 17న సాయంత్రం 5 గంటల వరకు పంచాయతీలకు నామినేషన్లను స్వీకరించ నున్నారు. తొలిదశలో 3,967 పంచాయతీలకు, పెండింగ్‌లో ఉన్న 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు.
Also Read: శ్రీశైలం భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటలూ నాన్‌స్టాప్ ప్రయాణం!