E-Paper
Advertisement

ఏపీలో అరుదైన ఘటన.. పుట్టుకతో తల నిండా జుట్టుతో జన్మించిన చిన్నారి!

ఏపీలో అరుదైన ఘటన.. పుట్టుకతో తల నిండా జుట్టుతో జన్మించిన చిన్నారి!
Advertisement

Guinness Record: అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామానికి చెందిన భవాని, సందీప్ దొర దంపతులకు ఇప్పటికే ఒక సంతానం ఉంది. రెండో కాన్పు కోసం సెప్టెంబర్ 18న అనకాపల్లిలోని వర్తక సంఘం మెటర్నిటీ హాస్పిటల్‌లో చేరారు. మొదట ఆపరేషన్ చేయాలని డాక్టర్లు అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో నార్మల్ డెలివరీలోనే భవాని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన పాపను చూడగానే అక్కడున్న డాక్టర్లు, నర్సులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

తల మీద జుట్టు..

ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సాధారణంగా ఆడపిల్ల అయినా, మగపిల్లవాడు అయినా.. పుట్టినప్పుడు తల మీద జుట్టు చాలా పలుచగా, అసలు లేనట్లే ఉంటుంది. కనీసం ఆర్నెల్లు లేదా ఏడాది దాటితే కానీ జుట్టు పెరగదు. అలాంటిది వందల డెలివరీలు చూసిన డాక్టర్లకు కూడా ఈ పాప ఓ వింతలా కనిపించింది. పుట్టిన వెంటనే తల నిండా ఒత్తైన, నల్లటి కురులతో ఆ చిన్నారి మహాలక్ష్మిలా మెరిసిపోయింది. పాప ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఇంత పొడవాటి జుట్టుతో పుట్టడం చూసి బంధువులు, ఊరు జనం మురిసిపోతున్నారు.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్..

Advertisement

పాప జుట్టు సాధారణం కంటే చాలా భిన్నంగా ఉండటంతో, తల్లిదండ్రులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం అప్లై చేశారు. పాప వివరాలను పరిశీలించిన గిన్నిస్ ప్రతినిధులు, ప్రత్యేకంగా జుట్టు పొడవును కొలిచారు. ఏకంగా 7 సెంటీమీటర్ల పొడవు జుట్టు ఉన్నట్లు నిర్ధారించి, ప్రపంచ రికార్డుగా నమోదు చేశారు. ఆ చిన్నారి పేరు మీద గిన్నిస్ సర్టిఫికెట్‌తో పాటు మెడల్ కూడా పంపించారు. పుట్టుకతోనే ఇంతటి అరుదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నారి భవిష్యత్తు కూడా ఉన్నతంగా ఉండాలని మనమూ కోరుకుందాం.

Also read: సిరిసిల్లలో చనిపోయిన వారి పేర్లతో లేబర్ కార్డుల దందా.. బీమా సొమ్ము మాయం

Tags

Related News

శ్రీశైలం భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటలూ నాన్‌స్టాప్ ప్రయాణం!

కర్నూలులో అద్భుత ఆచారం.. ఇక్కడ పాలు అమ్మబడవు.. కానీ అందరికి ఉచితం?

ఏపీని వణికించేందుకు వస్తున్న ఆక్వాన్ తుఫాన్.. నవంబర్ 17 నుంచే భారీ వర్షాలు!

మేయర్, ఛైర్మన్ స్థానాలకు.. జనసేన అభ్యర్థుల ఖరారు!

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. ఐదేళ్ల స్నేహితుడిని నరికి చంపిన నిందితుడు!

సీబీఐ అధికారుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. ఐదుగురి అరెస్టు

సీఎం చంద్రబాబుతో జనసేన నేతలు భేటీ.. ZP ఛైర్మన్ పదవులపై అదే ఉత్కంఠ, సాయంత్రం నాటికి

Big Stories

Advertisement
×