E-Paper
Advertisement

కర్నూలులో అద్భుత ఆచారం.. ఇక్కడ పాలు అమ్మబడవు.. కానీ అందరికి ఉచితం?

కర్నూలులో అద్భుత ఆచారం.. ఇక్కడ పాలు అమ్మబడవు.. కానీ అందరికి ఉచితం?
Advertisement

Free Milk: డబ్బు చుట్టూ తిరుగుతున్న ఈ రోజుల్లో.. మనిషికి మనిషి సాయం చేయడమే అరుదైపోతోంది. కానీ.. కర్నూలు జిల్లాలోని గంజహళ్లి, కడిమెట్ల గ్రామాలు మాత్రం దీనికి పూర్తి భిన్నం. ఇక్కడ పాలు అంటే కేవలం ఆహారం కాదు. ఊరి ఆచారం పెద్దల మాట అన్నింటికంటే మించి.. సాటి మనిషిపై ఉన్న ప్రేమ. అందుకే.. పాలను వ్యాపారంగా చూడరు. అవసరమైన వారికి ఉచితంగా పంచుతారు.

తమ ఊరి ఆచారం..

గంజహళ్లి విషయానికొస్తే.. గ్రామంలో 400కు పైగా పాడి పశువులు ఉన్నాయి. రోజూ ఐదారు వందల లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అవుతాయి. ఇంత పాలు ఉత్పత్తి అవుతున్నా.. ఒక్క చుక్కను కూడా అమ్మరు. ఇంటి అవసరాలకు సరిపోగా.. మిగిలిన పాలను పసిపిల్లలకు.. రోగులకు.. పాలు అందని పేదలకు ఉచితంగా ఇస్తారు. ఎవరైనా డబ్బులు ఇవ్వబోతే కూడా తీసుకోరు. పాలు అమ్మకూడదన్నది తమ ఊరి ఆచారం అని చెబుతారు. ఇది నిన్నో.. మొన్నో మొదలైన ఆచారం కాదు. దాదాపు 400 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.

గ్రామస్తులు కట్టుబాటుగా..

Advertisement

గంజహళ్లిలో సద్గురు బడేసాహెబ్ తాత చెప్పిన మాటను ఇప్పటికీ గ్రామస్తులు పాటిస్తున్నారు. నాటి రోజుల్లో పశువులకు వ్యాధి సోకినప్పుడు.. బడేసాహెబ్ మహిమతో అవి మళ్లీ పాలిచ్చాయని గ్రామస్తులు విశ్వసిస్తారు. అప్పటి నుంచి పాలను అమ్మకూడదని.. పశువులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని పెద్దలు చెప్పారట. ఆ మాటను ఇప్పటికీ గ్రామస్తులు కట్టుబాటుగా పాటిస్తున్నారు. తరాలు మారాయి.. జీవన విధానం మారింది.. కానీ.. ఆచారం మాత్రం మారలేదు.

చెన్నకేశవస్వామికి నైవేద్యంగా..

ఇదే మానవత్వం ఎమ్మిగనూరు సమీపంలోని కడిమెట్ల గ్రామంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ పాలు పితికిన వెంటనే.. తొలి పాలను తమ ఆరాధ్య దైవం చెన్నకేశవస్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. మిగిలిన పాలను ఊరివారికి ఉచితంగా పంచుతారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే..గ్రామంలో హోటళ్లు నడిపేవాళ్లు కూడా స్థానికుల దగ్గర పాలు కొనరు. అవసరమైతే పక్క గ్రామాల నుంచి పాలు తెచ్చుకుంటారు. కానీ.. తమ ఊరి పాలను మాత్రం అమ్మరు.. కొనరు. కొన్ని యాదవ కుటుంబాలు కూడా వారంలో 2 రోజులు మాత్రమే పాలు తాగుతూ.. మిగిలిన పాలను అనారోగ్యంతో ఉన్నవారికి, చిన్నపిల్లలకు అందిస్తుంటారు. డబ్బు కోసం పాలు అమ్ముకునే రోజుల్లో.. పక్కవారి కోసం పాలను పంచుతున్నాయి ఈ 2 గ్రామాలు. 400 ఏళ్ల క్రితం మొదలైన ఓ ఆచారం.. ఇవాళ ఒక సామాజిక సేవగా మారింది.

Advertisement

Also Read: ఎప్పటికీ నువ్వే నా సూపర్ స్టార్… తండ్రిని గుర్తు చేసుకుంటూ మహేష్ ఎమోషనల్!

Tags

Related News

ఏపీని వణికించేందుకు వస్తున్న ఆక్వాన్ తుఫాన్.. నవంబర్ 17 నుంచే భారీ వర్షాలు!

మేయర్, ఛైర్మన్ స్థానాలకు.. జనసేన అభ్యర్థుల ఖరారు!

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. ఐదేళ్ల స్నేహితుడిని నరికి చంపిన నిందితుడు!

సీబీఐ అధికారుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. ఐదుగురి అరెస్టు

సీఎం చంద్రబాబుతో జనసేన నేతలు భేటీ.. ZP ఛైర్మన్ పదవులపై అదే ఉత్కంఠ, సాయంత్రం నాటికి

ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ఐదుగురు మృతి, వికారాబాద్-తిరుపతి ఏరియాల్లో

కార్తీకమాసం ఎఫెక్ట్.. దిగొస్తున్న చికెన్ ధరలు, భగ్గుమన్న కూరగాయల ధరలు

Big Stories

Advertisement
×