Rains In Andrapradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారుతోందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీనివల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు కురవడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు ఏపీ తీర ప్రాంతాల్లోనూ ఈదురుగాలులు వీస్తున్నాయి. అంతే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: స్వయంగా నేనే చర్యలు తీసుకుంటా.. కాళేశ్వరం విచారణలో చీఫ్ జస్టిస్ చంద్రఘోష్
గూడూరు, అల్లూరు, కావలి, ఆత్మకూరు, సూలూరుపేటతో పాటూ మరికొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు ఎవరూ చేపలవేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. అన్ని పోర్టులలో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు రాబోయే 12 గంటల్లో తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రెండు రోజుల్లో తుఫాన్ తమిళనాడు, శ్రీలంక తీరాలపైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాబోయే 5 రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ముఖ్యంగా దక్షిణ కోస్తా, ఉత్తరకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అంతే కాకుండా ఈ రోజు నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తుఫాన్ నేపథ్యంలో తిరపతిలో హైఅలర్ట్ ప్రకటించారు. సూళ్లూరుపేట, గూడురు,నాయుడు పేట, తిరుపతి లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.