Gundeninda GudiGantalu Today episode November 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలుకి మీనా థాంక్స్ చెప్తుంది. కానీ, డాక్యుమెంట్స్ ఇచ్చిన విషయం తనకు చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదని మరోసారి మీనాపై బాలు కోపడ్డాతాడు.. ఇక కారు లేకపోతే పోనిలే వాడి కాళ్ళు అయితే పట్టుకొను, ఈ ప్రపంచంలో వాడోక్కడే ఉన్నాడా? వేరే జాబ్ వెతుకుంటాను అని వెళ్లి పోతాడు. బాలు జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇక రోహిణికి ఫోన్ వస్తే మౌనిక రోహిణిని పిలుస్తుంది. రోహిణికి దినేష్ మరోసారి ఫోన్ చేస్తాడు. నీ విషయం ఇంట్లో వాళ్లకు తెలియలేదా? అని ప్రశ్నించాడు. తనకు వారం రోజుల్లోగా 50వేలు ఇవ్వాలని, మళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తాడు దినేష్. గతంలో ఇవ్వాల్సిన 25 వేలు ప్రస్తుతం 50 వేలు .. మొత్తం 75 వేల రూపాయలను ఇవ్వాలని, లేకపోతే.. ఈ సారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనీ వార్నింగ్ ఇస్తాడు. బాలు జాబ్ కోసం వెళ్తాడు. ఎక్కడ జాబ్ దొరకదు. ప్రభావతి మాత్రం మీనాను సరుకులకు డబ్బులు ఇవ్వలేదని నానా మాటలు అంటుంది. ఎలాగైనా డబ్బులు తీసుకురావాలని మీనా తన గాజులను తీసుకెళ్లి తాకట్టు పెట్టాలని భావిస్తుంది. అలా తనకు తెలిసిన షాప్ దగ్గరికి వెళ్లి.. డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.. తన తమ్ముడు శివకు కాల్ చేసి రమ్మని చెప్తుంది. గాజులు ఇచ్చి డబ్బులు తెచ్చివ్వమని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడ జాబ్ దొరకదు. అటు ప్రభావతి ఇంట్లో సరుకులు వస్తున్నాయి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళాడా మొగుడు పెళ్ళాలు డబ్బులు ఇవ్వకుండా తిని కూర్చున్నామని అనుకుంటున్నారా అనేసి మోహిని ముందే మీనా బాలు పరువు తీసేలా మాట్లాడుతుంది. ఈసారి కాస్త లేట్ అయిందని చెప్తున్నాడు కదా అత్తయ్య ఇస్తాడు లే అనేసి అంటుంది. ఈ ప్రభావతి ససేమిరా అంటుంది. ఊరికే తిని ఇంట్లో ఉండడానికి ఇదేమైనా సత్రమా అనేసి నానా మాటలు అంటుంది ప్రభావతి. డబ్బులే కదా కావాల్సింది ఆయన దగ్గరికి వెళ్లి నేను తీసుకొచ్చేస్తాను అనేసి మీనా బయలుదేరుతుంది. గాజులను తాకట్టు పెట్టాలని కొట్టు దగ్గరికి వెళ్తే అది మూసేసి ఉంటుంది. ఇక మీనా వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి రమ్మంటుంది.. శివ రాగానే బైక్ ఎవరిదని అడుగుతుంది. ఫ్రెండుదని చెప్తాడు. డబ్బులు అవసరం వచ్చాయి ఈ గాజులు తాకెట్టు పెట్టి నాకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వవా అనేసి అడుగుతుంది. నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు అక్క నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అక్కడ వాళ్ళని అడిగితే ఇస్తారు అనేసి శివ అంటాడు. కెళ్ళి చదువుకోకుండా ఈ జాబులు అవి ఎందుకురా నువ్వు బుద్ధిగా చదువుకునేసి మీనా అంటుంది. ఈ గాజులు తీసుకెళ్లి తాకట్టు పెట్టి నాకు డబ్బులు తెచ్చివ్వు అనేసి మీనా గాజులను శివకిస్తుంది.
ఇక బాలు అలా వెళుతూ ఉంటే తెలిసిన ఒక అతను బాలు అని పిలుస్తాడు. నల్ల బంగారం అయిపోయావు బాలు అసలు నీతో మాట్లాడాలన్నా కానీ కుదరట్లేదు దొరకట్లేదు నువ్వు అసలు అనేసి ఆయన అంటాడు. ఏమైందన్నా చెప్పు అంటే నాకు ఒక ఒక పనిమనిషి కావాలి అనేసి అడుగుతాడు. ఎందుకన్నా అంటే మా అపార్ట్మెంట్లో కార్లు ఉన్నాయి కడగాలి అనేసి అంటాడు. దానికైతే నేను చేస్తాను అన్న ఎంత ఇస్తారు జీవితం అని అడిగితే నీకేమైంది బలు నీకు సొంత కార్ ఉంది కదా అనగానే ఆ కారు అవసరాలకి అమ్మేశానన్న ఇప్పుడు నేను ఖాళీగానే ఉన్నాను నేను చేస్తాను అన్నాను అంటాడు. మీ డ్రైవర్ పోస్ట్ కాదుగా బాలు కార్లు కడగాలి అంటే నేను రోజు నాకు కార్ని కడుక్కునేదాన్ని ఇప్పుడు అన్ని కార్లు కడుగుతాను అనేసి బాలు ఆ జాబ్ కి ఒప్పుకుంటాడు. అపార్ట్మెంట్ కి వెళ్లి కార్లు క్లీన్ చేస్తాడు. కారును మంచిగా క్లీన్ చేస్తే ఇంకా ఎక్కువే డబ్బులు ఇస్తానని ఒక అతను చెప్తాడు. ఇక మీనా శివ రమ్మన్న చోటికి వెళుతుంది. శివ మీనాకు డబ్బులు తెచ్చి ఇస్తాడు. రసీదు నీ దగ్గరే ఉంది కదా అంటే అవునక్కా నా బుక్స్ లోనే ఉంది ఇవ్వనా అంటే నీ దగ్గరే పెట్టుకోరా నేను డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వే కదా వెళ్లాలి అనేసి అంటుంది. ఇక డబ్బుల్ని తీసుకెళ్లి ప్రభావత్కిస్తుంది. సరుకులకు ప్రభావతి డబ్బులు కట్టేస్తుంది.
అప్పుడే బాలు ఇంట్లోకి వస్తాడు. రోహిణి మనోజ్ వాళ్ళ సరుకులు పక్కకు తీసుకుంటారు. డ్రై ఫ్రూట్స్ ఎక్కడున్నాయి రోహిణి మనోజ్ అడగగానే వంటగదిలోనే ఉండని మనసు అవి ఎందుకు బెడ్ రూమ్లో అని అనగానే బాలు మందులకి మంచి కోసమైనా వాటిని వాడేస్తారు మన గదిలోని పెట్టుకున్నామనేసి అంటాడు. బాలు ఇంట్లోకి రాగానే సరుకులు చూసి సరుకులకు డబ్బులు ఇవ్వాలి కదా రేపు ఇచ్చేస్తాను అనేసి అంటాడు. ఇచ్చావని మీ ఆవిడ ఇచ్చింది కదా మళ్లీ అంటావేంటి అని అది అడుగుతుంది. మీనా ను ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చావే దొంగతనం చేయడం నీకు మీ తమ్ముడికి అలవాటే కదా అనేసి అంటుంది. ప్రాణం పోయినా నేను దొంగతనం చేయను అత్తయ్య నేనేమన్నా ఇంతవరకు ఎన్ని లక్షలు దొంగతనం చేశాను ఎవరికి ఇచ్చాను అనేసి మీనా అంటుంది. దానికి బాలు నేను కారు ఈఏమ్ఐ కట్టాలని ఇచ్చాను కదా అది ఇచ్చేసావా ఏంటి అనేసి అడుగుతాడు. మీనాని దొంగ అనడంతో మీనాకు సపోర్ట్ గా బాలు నిలుస్తాడు. ఇంటి పత్రాలు ఎత్తుకెళ్లింది తాకట్టు పెట్టింది లక్షల మింగేసినోడు మీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసా అనేసి వార్నింగ్ ఇస్తాడు. మీనా రూమ్ లోకి రాగానే బాలు అడుగుతాడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చావు అనేసి అడుగుతాడు.
మీరు అప్పుడప్పుడు ఇచ్చినవి నేను దాచి పెట్టుకున్నాను అనేసి అబద్ధం చెప్తుంది మీనా.. మీనా చెప్పిన మాటల్ని బాలు నమ్మడు. అందరికన్నా ఎక్కువ నేనే తింటున్నాను అంట అందరు తిన్న తర్వాత ఉంటే కూర తింటాను లేకపోతే పచ్చడి వేసుకొని తింటాను కానీ నన్ను నా మాటని లోపల చాలా బాధేసింది అనేసి మీనా బాలుతో అంటుంది. అన్న పర్లేదు మిమ్మల్ని అంటున్నారు మీరు ఒక నెల జీతం ఇవ్వకపోతే ఫ్రీగా తింటున్నారంట అని నాన్న మాటలు అనే లోగా నేను బాధపడ్డాను అనేసి అంటుంది. అసలు తాకట్టు పెట్టిన విషయం బాలుకు తెలిసిపోతుంది. జీతం వచ్చిన తర్వాత ఆ గాజులను విడిపించాలి రసీదు నీ దగ్గర పెట్టుకొని అని బాలు చెప్తాడు. ఇక మనోజ్ జాబ్ చేస్తున్నానని నటించడం కన్నా జాబ్ చేయడమే ఈజీ అనేసి మాట్లాడుకుంటుంటాడు. రోహిణి వస్తుంది.. లేదన్న విషయం రోహిణి వినిందా అని మనసులో అనుకుంటాడు. రోహిణి దీపావళి తర్వాత నీకు బోనస్ లు ఇస్తారు కదా ఇచ్చారా ఎంత ఇచ్చారు అని అడుగుతుంది. ఏం ఇవ్వలేదు రోహిణి నేను బెస్ట్ ఎంప్లాయ్ నా నాకు అంత డబ్బులు ఇవ్వలేదు అనేసి మనోజ్ చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలు జాబ్ గురించి మీనాకు తెలిసిపోతుంది. మరి బాలు ఎలా కవర్ చేస్తాడో చూడాలి..