శీతాకాలంలో చలి వేయడం సహజం. అయితే కొంతమంది చిన్నపాటి చలిని కూడా తట్టుకోలేరు. చుట్టూ ఉన్నవారితో పోలిస్తే మీరు ఎక్కువ గా వణికిపోతూ ఉంటారు. ఇంటా బయటా కూడా చలి జాకెట్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇతరులతో పోలిస్తే మీకు చలి ఎక్కువగా అనిపిస్తుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. అదే జరిగితే మీకు విటమిన్ బి12 లోపం ఉన్నట్టే లెక్క.
మన శరీరంలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేందుకు ఒక ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. దాని పేరు ధర్మోరెగ్యులేషన్ అంటారు. మనం శరీర ఉష్ణోగ్రత 98.6 ఫారెన్ హీట్ ఉండేలా చూస్తుంది. మెదడు, ధమనులు, చెమట గ్రంధులు ఇవన్నీ కూడా ఉష్ణోగ్రత నియంత్రించడానికి కలిసి పనిచేస్తాయి. చల్లగా ఉన్న పరిస్థితుల్లో మన శరీరం వెచ్చగా ఉండేలా చూస్తాయి. వేడికి గురైనప్పుడు చల్లదనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. అయితే వీటి పనితీరులో కొన్నిసార్లు మార్పు రావచ్చు. పోషకాహార లోపం వల్ల విటమిన్లు లోపించడం వల్ల ,వైరల్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఉష్ణోగ్రతలో తీవ్ర మార్పుల వల్ల సమస్యలు మొదలవుతాయి. ఎక్కువ మందిలో విటమిన్ లోపం వల్లే వీటి పనితీరు దెబ్బతింటుంది.
శరీరం అధికంగా ఐరన్, విటమిన్ బి12, విటమిన్ సి, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ పోషకాలు తగినంత ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహించి ఆక్సిజన్ రవాణాను చేస్తేనే శరీరం వెచ్చగా ఉంటుంది. వీటిలో ఏదైనా లోపిస్తే మీ శరీర ఉష్ణోగ్రత మారిపోతుంది. కొందరికి అధికంగా చెమటలు పట్టడం, మరికొందరికి తీవ్రమైన చలివేయడం వంటివి జరుగుతాయి.
మీకు మీలో విటమిన్ బి 12 లోపిస్తే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మందగిస్తుంది. మెదడు పనితీరు కూడా మారిపోతుంది. శరీరంలో తగినంత విటమిన్ బి12 లేకపోతే మీ శరీరం ఆరోగ్యకరంగా రక్త కణాలను తయారు చేయడానికి ఎంతో కష్టపడుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల రక్తహీనత సమస్య కూడా మొదలవుతుంది. ఎప్పుడైతే రక్తహీనత సమస్య వచ్చిందో శరీరానికి ఆక్సిజన్ ప్రసరణ తగ్గిపోతుంది. దీనివల్ల చలి ఎక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా చేతులు, కాళ్లు వంటి చివరి భాగాల్లో చల్లగా మారిపోతుంది.
ఫోలేట్ అంటే విటమిన్ బి9 కూడా ఎర్ర రక్త కణాలను సృష్టించడానికి, విటమిన్ బి12తో కలిసి పనిచేస్తుంది. మీ శరీరంలో ఫోలేట్ కొరత ఏర్పడితే అలసట శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరానికి ఆక్సిజన్ తగినంతగా చేరకపోవడం వల్ల చేతులు కాళ్లు చల్లగా మారిపోతాయి. ఫోలేట్ కోసం ఆకుకూరలు, బీన్స్, సిట్రస్ పండ్లు తినాల్సిన అవసరం ఉంది.
Also Read: భోజనాన్ని వంటగదిలో నేలపై కూర్చుని తింటేనే ఆరోగ్యమట, ఎలానో తెలుసుకోండి
మన శరీరానికి ఐరన్ అత్యవసరమైనది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ ముఖ్యం. ఎర్ర రక్తకణాలలో ఉండే ప్రోటీనే హిమోగ్లోబిన్. ఇది మీ శరీరం అంతట ఆక్సిజన్ ను రవాణా చేస్తుంది. ఆక్సిజన్ అందకపోతే కండరాలు, కణజాలాలు తగినంత వేడిని ఉత్పత్తి చేయలేవు. ఐరన్ కొరత వల్ల ఎనీమియా అంటే రక్తహీనత సమస్య వస్తుంది. ఇది కూడా శరీరాన్ని చల్లగా మార్చేస్తుంది. బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇనుము లోపం రాకుండా ఉండాలంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలి.