Hindupuram farmers gave shock to Balakrishna by making Dharna: వరుస సినిమాల హిట్స్ తో రాజకీయంగానూ.. వరుస విజయాలతో దూసుకెళుతున్నారు నందమూరి బాలకష్ణ. మరో పక్క తనయుడు మోక్షజ్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అన్నీ కలిసి బాలకృష్ణకు డబుల్ రేంజ్ లో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రం చేయబోతున్నారు. ఇప్పటికే సింహా , లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో వచ్చే మూవీ మరెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ నటించిన 109వ చిత్రంగా రాబోతోంది.
మూడు సార్లు ఎమ్మెల్యే
బోయపాటి అంటేనే భారీ బడ్జెట్ తోపాటు భారీ క్యాస్టింగ్ కూడా ఉంటుంది. బలమైన ఫ్యామిలీ సెంటిమెంటు కూడా ఉంటుంది. విశేషం ఏమిటంటే ఈ సినిమాలో బాలయ్యకు ప్రతినాయకుడి పాత్రలో గోపీచంద్ నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గోపీచంద్ కు తొలుత విలన్ గానే గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత హీరోగా మారి.. వరుస విజయాలను అందుకున్నారు. ఈ మూవీకి విశ్వం అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అఖండకు సీక్వెల్ అంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాలపై నిర్మాతల నుంచి ఇంకా ఏదీ క్లారిటీ రాలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే బాలకృష్ణ అంటే హిందూపురం ప్రజలకు ఎంతో అభిమానం. రెండేళ్ల క్రితం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చాలా చోట్ల ఓడిపోయింది. పూర్తిగా వన్ సైడ్ వార్ లాగా జగన్ హవా నడిచింది. అలాంటి ప్రతికూల పరిస్థితిలోనూ హిందూ పురం నియోజకవర్గం ఓటర్లు బాలకృష్ణకు అండగా నిలిచారు. ఇప్పటిదాకా మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు బాలకృష్ణ. హిందూపురం ప్రజలతో బాలకృష్ణ కలిసి మమేకమై అనేక కార్యక్రమాలు నిర్వహించడమే కాదు.. వాటిని విజయవంతం కూడా చేస్తుంటారు.
హిందూపురంతో అనుబంధం
హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి అహరహరం పాటుపడుతూ ఉంటారు బాలయ్య. ఎంత సినిమా షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ ప్రతి వారం హిందూపురం వెళ్లి వస్తుంటారు బాలయ్య. బాలయ్యకు హిందూపురం ప్రజలకు విడదీయరాని సంబంధం ఏర్పడింది. అంతలా క్రేజ్ తెచ్చుకున్నారు బాలయ్య బాబు. అలాంటిది ఇప్పుడు బాలయ్య కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. ప్రస్తుతం హిందూపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయంపై చర్చించుకుంటున్నారు జనం. అసలు ఇంతకీ హిందూపురంలో ఈ పరిస్థితికి దారితీసిన అంశమేమిటంటే తమ భూములు, పొలాలు కొంతమంది టీడీపీ నేతలు ఆక్రమించుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులంతా కలిసి కబ్జాదారులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
రైతన్నల ఆగ్రహం
ఓ రైతుకు చెందిన రూ.2 కోట్ల భవనాన్ని అధికారులు కూల్చేశారు. స్వయంగా టీడీపీ నేతలే ఇలా కబ్జాలకు పాల్పడుతుంటే ఎవరికి తమ గోడు చెప్పుకోవాలంటూ రైతులు రోడ్డెక్కారు. అయితే ఇంతవరకూ బాలకృష్ణ బాధిత రైతులను కలవలేదు. కలిస్తే తప్పక వారికి న్యాయం చేస్తారని అభిమానులు అంటున్నారు. ఈ విషయాలు బాలయ్య బాబు దృష్టికి ఇంకా చేరుకుని ఉండవని..బాలకృష్ణకు తెలిస్తే పరిస్థితి వేరేరకంగా ఉంటుందని అంటున్నారు.