BigTV English

Devineni Avinash: అరెస్ట్ తప్పించుకునేందుకు దేవినేని అవినాష్ ప్లాన్.. ఆ కేసులో?

Devineni Avinash: అరెస్ట్ తప్పించుకునేందుకు దేవినేని అవినాష్ ప్లాన్.. ఆ కేసులో?

Devineni Avinash: టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ నేత దేవినేని అవినాష్. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పిటిషన్ వచ్చేవారం విచారణకు రానుంది.


టీడీపీ ఆఫీసు దాడి కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ముఖ్యనేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి. ఇందులోభాగంగా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది.

ALSO READ: ప్రకాశం బ్యారేజ్ గేట్ల ధ్వంసం ఘటనలో ఇద్దరు అరెస్ట్.. కుట్రా? నిర్లక్ష్యమా?


అప్పటినుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆయా నేతలు. విజయవాడ వరదల సమయంలోనూ కనిపించలేదు. దీంతో పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు. అరెస్ట్ నుంచి తప్పించుకు నేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలావుండగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు వైసీపీ నేత దేవినేని అవినాష్. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరపున పిటిషన్లు దాఖలు చేశారు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. ఆయా పిటిషన్లు వచ్చేవారం విచారణకు రానుంది. అప్పటివరకు వారంతా పరారీలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

2021, అక్టోబరు 19న టీడీపీ ఆఫీసుపై దాడి చేశారు కొంతమంది వ్యక్తులు. ఆఫీసులోకి చొరబడి ఫర్మీచర్‌ను ధ్వంసం చేశారు. రీసెంట్‌గా ఏపీలో అధికార మార్పిడి జరగడంతో ఆ కేసును వేగవంతం చేశారు పోలీసులు.

ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న దేవినేని అవినాశ్, జోగి రమేష్, రఘురాం, నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డిలు హైకోర్టులో ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. అప్పటి నుంచి ఆయా నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించారు. విచారణ తర్వాత న్యాయస్థానం ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది.

20 రోజుల కిందట దేవినేని అవినాష్ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసు ఉండడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా పిటిషన్ తోసిపుచ్చితే.. ఆయా నేతలు అరెస్ట్ కావడం ఖాయమనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

Related News

Amaravati News: పైసా మే ప్రమోషన్‌ చిచ్చు.. సాక్షి పత్రికపై కేసు నమోదు

CM Chandrababu: సీఎం బాబు @30.. సాక్షిలో ఊహించని ప్రచారం

Miss Visakhapatnam 2025: విశాఖ అందాల తార ఈ యువతే.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!

AP rains: వరుణుడి ఉగ్రరూపం.. ఈ జిల్లాల పైనే.. బిగ్ అలర్ట్ అంటున్న అధికారులు!

AP Politics: అప్పుడు హీరో.. ఇప్పుడు జీరో.. అన్నా రాంబాబు బ్యాడ్ టైమ్..

CM Progress Report: ఏపీలో రూ.53 వేల కోట్లతో ప్రాజెక్టులకు ఆమోదం.. 30 ప్రాజెక్టులివే!

Big Stories

×