Honour killing in Chittoor district(Andhra news today): ఏపీలో దారుణం చోటు చేసుకుంది. తన ఇష్టమైనవాడితో గుట్టుచప్పుడు కాకుండా మైనర్ బాలిక మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయం తెలిసి బాలిక పెద్దలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఆవేశంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని భావించారు. పక్కాగా స్కెచ్ వేసి బాలికను చంపేసి, ఆపై తగలబెట్టారు. సింపుల్ గా చెప్పాలంటే పరువుహత్య అన్నమాట. సంచలన రేపిన ఈ ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం.. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక.. బంధువుల అబ్బాయిని ప్రేమించింది. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆపై పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ విషయం బాలిక పేరెంట్స్‌కి తెలిసింది. అసలే పల్లెటూరు.. ఆపై కట్టుబాట్లు.. కూతురు చేసిన పనికి రగిలిపోయారు ఆ పేరెంట్స్. దీనికితోడు ఆ ఊరు కుల పెద్దలు వీరిని నానామాటలు అన్నారు.
సీన్ కట్ చేస్తే.. పెద్ద మండ్యం మండలం బండ్రేవు పంచాయితీ తపసిమానుగుట్ట ఊరు శివార్లలో మైనర్ బాలిక చెట్టుకు ఉరేసుకుంది. మృతదేహాన్ని చూసిన గొర్రెల కాపరులు, వీఆర్‌వో కుటుంబసభ్యులకు తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు అయితే మరిన్ని సమస్యలు తప్పవని భావించిన కొందరు పెద్దలు, బాలిక మృతదేహాన్ని పొలంలోకి తీసుకెళ్లి కాల్చేశారు.
ALSO READ: కోర్టులో జోగి రాజీవ్‌ను హాజరుపరిచిన ఏసీబీ
చివరకు మైనర్ బాలిక హత్య విషయం పోలీసు అధికారులకు తెలిసింది. అనుమానాస్పద స్థితిలో బాలిక మరణించినట్టు కేసు నమోదు అయినట్టు చెప్పారు. దీనిపై విచారణ చేస్తున్నామని, నేరం రుజువైతే నిందితులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఆ గ్రామానికి చెందిన పెద్ద మనుషులపై విచారణ చేపడతామన్నారు మదనపల్లె డీఎస్పీ.
కొద్దిరోజుల వెనక్కి వెళ్తే.. గత నెలలో బాలిక మిస్సయినట్టు తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో యువతిని వెతికి తెచ్చి అప్పగించారు. అయితే సోమవారం బాలిక అనుమానాస్పదంగా మృతి చెందడం, ఆ తర్వాత డెడ్‌బాడీని కాల్చేయడం వంటి పరిణామాలను గమనించారు స్థానికులు. ఇది ముమ్మాటికీ పరువు హత్యగా చెబుతున్నారు. మరి పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.