BigTV English

Vinesh Phogat Verdict: వినేశ్ కేసులో వీడని ఉత్కంఠ.. తీర్పు మళ్లీ వాయిదా

Vinesh Phogat Verdict: వినేశ్ కేసులో వీడని ఉత్కంఠ.. తీర్పు మళ్లీ వాయిదా

Vinesh Phogat verdict on medal(Latest sports news telugu): పారిస్ ఒలింపిక్స్‌ 2024లో సిల్వర్ కోసం పోరాడుతున్న భారత స్తార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు మళ్లీ నిరాశ ఎదురైంది. యావత్ భారతదేశం ఎదురుచూసిన కోర్ట్ ఆఫ్ ఆర్భిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) తీర్పును మళ్లీ వాయిదా వేసింది. ఈ మేరకు కోర్టు తీర్పును ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేయడంతో ఇంకా మూడు రోజులు రజతం వస్తుందా? లేదా? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.


భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు అనుకూల తీర్పు వస్తుందని, ఆమెకు రజత పతకం దక్కుతందని అందరూ భావించారు. కాగా, పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ప్రిక్వార్టర్స్ లో వరల్డ్ నంబర్ వన్, జపాన్ కు చెందిన సుసాకీని ఓడించి చరిత్ర సృష్టించిన ఈ హర్యానా అథ్లెట్ తర్వాత కూడా దిగ్విజయంగా విజయం సాధించింది.

తొలి రౌండ్ లో డిపెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ వన్ యుయ్ సుసాకిని ఓడించిన ఫొగట్..రెండో రౌండ్  లోనూ ఉక్రెయిన్ ప్లేయర్ ఒక్సానా లివాచ్ పై గెలిచింది. సెమీఫైనల్ లోనూ క్యూబా రెజ్లర్ యుస్సీలీస్ గుజ్మాన్ పై ఆధిక్యత సాధించి ఓడించడంతో ఫైనల్ చేరింది.


అయితే ఫైనల్ లో అమెరికా రెజ్లర్ సారా హిల్డెబ్రాండ్ తో వినేశ్ తలపడాల్సిన సమయంలో 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటుకు గురైంది. వాస్తవానికి తన తొలి మ్యాచ్ కు ముందు వినేశ్ 49 కేజీల బరువు మాత్రమే ఉంది. నిబంధనల ప్రకారం.. ఆమె పోటీలకు అర్హత సాధించింది. ఒకే రోజు మూడు మ్యాచ్ లు ఉండడంతో ఎనర్జీ కోసం ఆమె ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె రెండు కిలోల బరువు పెరిగింది.

ఇదిలా ఉండగా, వినేశ్ తప్ప మరే రెజ్లర్ అతి తక్కువ సమయంలో మూడు మ్యాచ్ లు ఆడలేదు. అందుకే ఇతర క్రీడాకారులు బరువును కంట్రోల్ చేసుకున్నారు. వినేశ్ కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు. అయితే తనకు జరిగిన అన్యాయంపై వినేశ్ కాస్ ను ఆశ్రయించింది.

Also Read: ఇకపై రెస్ట్ తీసుకోనున్న భారత ప్లేయర్, ఎందుకంటే…!

వినేశ్ తరఫున హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా మంగళవారం వాదనలు వినిపించారు. రాత్రి 9.30 నిమిషాలకు తీర్పు వెలువరించాల్సి ఉండగా.. తీర్పు మరోసారి వాయిదా వేశారు. దీంతో 140 కోట్ల భారతీయులు నిరాశకు గురయ్యారు. వినేశ్ ఫొగట్..తీర్పు కోసం పారిస్ లో ఉండాల్సి వచ్చింది.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×