BigTV English
Advertisement

Nandamuri Chaitanyakrishna: బిగ్ బాస్ 8 హౌస్ లోకి తొలిసారి నందమూరి హీరో ఎంట్రీ

Nandamuri Chaitanyakrishna: బిగ్ బాస్ 8 హౌస్ లోకి తొలిసారి నందమూరి హీరో ఎంట్రీ

Nandamuri Chaitanya krishna to Big Boss 8(Tollywood celebrity news): బిగ్ బాస్8 సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అయితే ఇంతవరకూ కంటెస్టెంట్ల విషయంలో క్లారిటీ రాలేదు అఫిషియల్ గా కూడా ఎక్కడా ప్రకటించడం లేదు. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి చాలా పకడ్పందీగా నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే నాగ్ హింట్ ఇచ్చేశాడు. పైగా ప్రోమోలలో ఈ సారి ఎంటర్ టైన్ మెంట్ కూడా డబుల్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లుగా ఎక్కువ శాతం కొత్తవారిని తీసుకోవడంతో వారు ఆడియన్స్ కు కనెక్ట్ కావడానికి సమయం పట్టింది. దీనితో కొందరు బిగ్ బాస్ చూడటం తగ్గించేశారు. దానితో రేటింగ్ విషయంలోనూ బిగ్ బాస్ తగ్గుతూ వస్తోంది.


హీరోగా తొలి సినిమా ఫ్లాప్

ఈ సారి కాస్త తెలిసిన మొహాలు ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఈ సారి నందమూరి ఫ్యామిలీనుంచి వచ్చిన చైతన్య కృష్ణ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. నందమూరి జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ. జయకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ కుమారులలో ఒకరు. చైతన్యకృష్ణ సినిమా ఇండస్ట్రీకి లేట్ వయసులో ఎంట్రీ ఇచ్చాడు. మెడికల్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ‘బ్రీత్’ అనే మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వంశీకృష్ణ ఆకెళ్ల ఆ మూవీకి దర్శకుడు. అయితే నటనా పరంగా మంచి మార్కులే కొట్టేసిన చైతన్య కృష్ణకు ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. ‘బ్రీత్’ మూవీ సక్సెస్ కాలేకపోయింది. తర్వాత 2003లో ధమ్ అనే మూవీ లో నటించాడు. ఆ మూవీకి జగపతి బాబు హీరో.


ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం

ఎందుకో ఆ మూవీ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చాడు.హీరోగా ముదురు వయసులో ఎంట్రీ ఇచ్చాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. అవకాశాలు లేకనో లేక సరైన సినిమా రాకూ మొత్తానికి సినీ పరిశ్రమ వర్గానికే దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ తో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆడిషన్స్ పూర్తయ్యాయి. అదే జరిగితే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన తొలి నందమూరి హీరో అతడే అవుతాడు. బిగ్ బాస్ తర్వాత తనకు గుర్తింపు లభిస్తుందని, మళ్లీ అవకాశాలు వస్తాయని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. తన కెరీర్ కి బిగ్ బాస్ ఎంట్రీ ఉపయోగపడుతుందని చైతన్య కృష్ణ భావిస్తున్నాడట. అందుకు ఇదే సరైన ఫ్టాట్ ఫామ్ గా భావిస్తున్నట్లు సమాచారం.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×