BigTV English

Woman Burns Step-Daughter: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..

Woman Burns Step-Daughter: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..

Woman Burns Step-Daughter| ద్వేషం అనే భావన సాధారణ మనిషిని కూడా మానసికంగా కృూరంగా మార్చేస్తుంది. అందుకే గుండె నిండా ద్వేషం ఉంటే ఏది తప్పు ఏది ఒప్పు అనే విచక్షణ చేయలేరని పెద్దలు చెబుతూ ఉంటారు. కొందరు తమ ద్వేషంలో అమాయకులు, చిన్నారులతో కూడా హింసాత్మకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటిదే ఒక ఒళ్లుగగ్గురు పొడిచే సంఘటన మహారాష్ట్రలో జరిగింది.


మహారాష్ట్రలోని కోల్హాపూర్ లో ఒక మహిళ తన అయిదేళ్ల కూతురి కాళ్లు, చేతులు, మూతి, ప్రైవేట్ భాగాలపై కూడా నిప్పులపై కాల్చిన అట్లకడతో వాతలు పెట్టింది. ఆ వాతల ఆ చిన్నారి తల్లడిల్లిపోయింది. ఇదంతా తరువాత చూసిన ఆ పాప తండ్రి ఏకంగా పోలీస్ స్టేషన్ లో తన భార్యపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు.

Also Read: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!


కోల్హాపూర్ నగరంలోని హటక్‌నంగలే తుల్కా ప్రాంతంలో శుభం మగరే, అతని భార్య పూజా మగరే నివసిస్తున్నారు. వారిద్దరికీ ఇద్దరు పిల్లలున్నారు. అయితే శుభం కు ఇది రెండో పెళ్లి అతని మొదటి భార్య చనిపోయింది. ఆ మొదటి భార్య వల్ల శుభం కు ఒక కూతురు ఉంది. మొది భార్య చనిపోయిన రెండేళ్ల తరువాత శుభం రెండో వివాహం చేసుకున్నాడు. శుభం రెండో భార్య పేరు పూజా. పూజా కు కూడా శుభంతో రెండో వివాహం. ఆ మొదటి భర్త ఆమెకు విడాకులిచ్చాడు. పూజకు కూడా మొదటి భర్త వల్ల ఒక కొడుకు ఉన్నాడు.

అలా శుభం, పూజా తన మొదటి వివాహం వల్ల కలిగిన సంతానాన్ని తమతో పాటే పెంచుకుంటున్నారు. కొన్ని నెలల క్రితమే వారిద్దరికీ వివాహం జరిగింది. అయితే పూజ.. శుభం కూతురిని ఇష్టపడేది. శుభం కూతురుని ఎప్పుడూ అరిచి మాట్లాడేది. కోపంగా భయపడించేది. శుభం ఆఫీసుకు వెళ్లిపోగానే పాపకు సరిగా ఆహారం కూడా పెట్టేది కాదు.

సవతి తల్లి అయిన పూజ వ్యవహారంతో ఆ చిన్నారి ఎప్పుడూ భయందోళనలో ఉండేది. దీంతో ఆ పాప ఈ మధ్య తరుచూ నిద్రలోనే మూత్ర విసర్జన చేసేది. ఈ కారణంగా పూజ మరింత కోపంగా ఆ పసిపిల్లను కొట్టేదని.. కనీసం తాగేందుకు పాలు కూడా ఇచ్చేది కాదని పోలీసుల విచారణలో ఇరుగుపొరుగు వారు తెలిపారు.

Also Read: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట,  రెండో పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన మహిళ

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పాప మళ్లీ పక్క తడిపేసింది. దీంతో పూజ కోపంతో పాపను బాగా కొట్టి.. ఆ తరువాత వంటగదిలోకి తీసుకొని వెళ్లి స్టవ్ పై బాగా అట్లకడ కాల్చి ఆ తరువాత ఆ కాలిపోతున్న అట్లకడతో పాప మూతి, చేతులు, కాళ్లు, ప్రైవేట్ భాగాలపై గట్టిగా వాతలు పెట్టింది. దీంతో ఆ పాప బిగ్గరగా ఏడ్చింది. పాప గుక్క తిప్పుకోకుండా ఏడవడం గమనించిన పక్కింటి వారు శుభంకు ఫోన్ చేసి ఇంట్లో పాప తెగఏడుస్తూ ఉందని తెలిపారు. శుభం ఇంటికి వచ్చి పాప పరిస్థితి చూసి తట్టుకోలేక పోయాడు.

పాపను శుభం వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆస్పత్రిలో డాక్టర్లకు విషయం చెప్పగానే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శుభం ఫిర్యాదు నమోదు చేసుకొని.. పూజను అరెస్టు చేశారు. పిల్లల పట్ల ఒక సవత తల్లి ఎంత ద్వేష భావన చూపిస్తందనేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణ.

Related News

Honey trap scam: 81 ఏళ్ల వృద్ధుడికి హనీ ట్రాప్ షాక్.. రూ.7.11 లక్షలు మాయం!

Annamaya District: అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి, ఒకరు గల్లంతు

Bhadradri Crime: ప్రాణం తీసిన పెళ్లి చూపులు.. యువతిని ఓయోకు తీసుకెళ్లి దారుణం

Delhi Triple Murder: ఢిల్లీలో ఘోరం.. ఓ ఫ్యామిలీలో ముగ్గురు దారుణ హత్య, నిందితుడు కుటుంబసభ్యుడే?

Hydrabad News: మియాపూర్‌లో దారుణం.. ఐదుగురు వ్యక్తులు సూసైడ్, ఏం కష్టమొచ్చింది?

Kurnool News: రాష్ట్రంలో దారుణ ఘటన.. నీటకుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి

Big Stories

×