E-Paper
Advertisement

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!
Advertisement

Eswatini king Wife Zuma| మానవులలో రాజులు వేరయా.. అనే సూక్తికి తాజా ఉదాహరణ సరిగా పోతుంది. ఒక చిన్న దేశానికి రాజు తన ప్రజలు ఆకలి చావులు చస్తున్నా.. తాను మాత్రం బాగా విలాసవంతమైన జీవనం గడుపుతున్నాడు. ఆ రాజుగారు ఇటీవలే 16వ వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. విచిత్రమేమిటంటే ఆ పెళ్లికూతురి వయసు 21 సంవత్సరాలైతే.. రాజు గారి వయసు ఏకంగా 56 సంవత్సరాలు. ఆయన ఇలాంటి 15 వివాహాలు ఇంతకు ముందే చేసుకోవడం విశేషం.

వివరాల్లోకి వెళితే.. ఆఫ్రికా ఖండంలోని దక్షిణా అఫ్రికా భాగంలో ఉన్న చిన్న దేశం ఎస్‌వాటినీ. అక్కడి రాజు ‘కింగ్ మిస్‌వాటీ 3’ 1986 సంవత్సరంలో కేవలం 18 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్టించాడు. అప్పటి నుంచి ఎస్‌వాటినీ దేశాన్ని నియంతలా పరిపాలిస్తున్నాడు. ఆఫ్రికా రాచరికం ఉన్న చివరి దేశం ఇదే.

Advertisement

అయితే తాజాగా కింగ్ మిస్‌వాటీ దేశపు మాజీ ప్రెసిడెంట్ కూతురు నోమ్‌కెబో జూమాతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. త్వరలో వివాహం కూడా జరగబోతోంది. వీరిద్దరి వివాహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వధువు నోమ్‌కెబో జూమా వయసు కేవలం 21 సంవత్సరాలు.. పైగా ఆమె చాలా అందంగా ఉంటుంది. కింగ్ మిస్‌వాటీ వయసు 56 ఏళ్లు. వారం రోజుల క్రితం వీరిద్దరి ఎంగేజ్మెంట్ కు వారి దేశ సంప్రదాయాల ప్రకారం.. అట్టహాసంగా నృత్యాలు, విందుభోజనాలతో జరిగింది. దాదాపు 5000 మంది ఈ వేడుకలకు హాజరు అయినట్లు సమాచారం.

Advertisement

కానీ కింగ్ మిస్‌వాటీ తన కంటే వయసులో చాలా చిన్న యువతులను వివాహం చేసుకోవడం గతంలో కూడా చేశారు. 2005 సెప్టెంబర్ లో 17 ఏళ్ల నికంబులే అనే యువతిని ఒక బహిరంగ కార్యక్రమంలో చూసి ప్రేమలో పడ్డాడు. నెల రోజుల తరవాతనే ఆమెను వివాహం చేసుకున్నాడు.

2001లో కింగ్ మిస్‌వాటీ ఒక చట్టం తీసుకువచ్చారు. తన దేశంలో ఎవరు కూడా 18 ఏళ్ల లోపు యువతులను వివాహం చేసుకోరాదు అని కఠినంగా ఆదేశాలు జారీ చేశారు. కానీ రెండు నెలల తరువాతనే ఆయన తన 9 వ భార్యగా ఓ 17 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకొని ఈ చట్టాన్ని ఉల్లఘించారు. అందుకోసం తనను తాను శిక్షించికునేందుకు ఒక ఆవుని దానం చేశారు.

కింగ్ మిస్‌వాటీ తన ప్రజలు, దేశం పేదరికం కారణంగా ఎన్నో సమస్యలతో సతమవుతుంటే తాను మాత్రం భోగభాగ్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారని గతంలో చాలా సార్లు విమర్శలు ఎదుర్కొన్నారు.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

కింగ్ మిస్‌వాటీకి ఇప్పటికి 15 సార్లు వివాహం చేసుకోగా.. అందులో నలుగురికి విడాకులిచ్చారు. 11 మంది భార్యలు ఆయన అంత:పురంలో ఉంటున్నారు. ఆయనకు మొత్తం 30 మందికి పైగా పిల్లలున్నారు. ఇంతపెద్ద వైవాహిక జీవితమున్నా తాజాగా ఆయన మరో వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఈ 16 వ పెళ్లి కూతురు దక్షిణ ఆఫ్రికా మాజీ ప్రెసిడెంట్ జాకబ్ జూమా కూతురు కావడంతో ఇది రాజకీయ ఒప్పందం ప్రకారం జరుగుతున్న పెళ్లి అనే చర్చలు జరుగుతున్నాయి. కానీ అలాంటిదేమే లేదు. ఈ వివాహం కేవలం వారిద్దరు ప్రేమించుకోవడం కారణంగా జరుగుతోందని కింగ్ మిస్‌వాటీ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు.

మరోవైపు కొత్త పెళ్లి కూతరు నోమ్‌కెబో జూమా కుటుంబంలో బహు భార్య సంప్రదాయం పాటిస్తున్నారు. ఆమె తండ్రి జాకబ్ జూమా(82)కు కూడా ఆరు సార్లు వివాహం చేసుకున్నారు. ఆయనకు కూడా 20 మంది సంతానం.

Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×