E-Paper
Advertisement

RCB జ‌ట్టులో కుదుపు..లండ‌న్ వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ..ఓపెన‌ర్ గా వెంక‌టేష్ అయ్య‌ర్ !

RCB జ‌ట్టులో కుదుపు..లండ‌న్ వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ..ఓపెన‌ర్ గా వెంక‌టేష్ అయ్య‌ర్ !
Advertisement

Virat Kohli Injury: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 22 మ్యాచులు పూర్తయ్యాయి. ప్రతి మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠ భరితంగా చివరి వరకు సాగుతోంది. ఇక ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Royal Challengers Bengaluru vs Lucknow Super Giants) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఇవాళ సాయంత్రం ఈ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో బెంగుళూరు అభిమానులకు ఊహించని శాఖ తగిలినట్లు చెబుతున్నారు. టోర్నమెంట్ మధ్యలోనే లండన్ కు విరాట్ కోహ్లీ వెళ్ళినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మెరుగైన వైద్యం కోసం మధ్యలోనే విరాట్ కోహ్లీ జంప్ అయ్యాడని ప్రచారం సాగుతోంది. ఈ త‌రుణంలోనే విరాట్ కోహ్లీ ( virat kohli ) స్థానంలో వెంకటేష్ అయ్యర్ ( venkatesh iyer) ఓపెనర్ గా వస్తాడని అంటున్నారు.

Also Read: Akhtar On Naqvi: భూత‌ద్దాలు పెట్టుకోని చూడు..పెట్రోల్ విష‌యంలో ఇండియా కాలి గోటికి కూడా పాక్ స‌రిపోదు

RCB జ‌ట్టులో కుదుపు..లండ‌న్ వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( RCB) ఊహించని షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ చీల‌మండ గాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే మొన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగగా, బ్యాటింగ్ చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోనే కూర్చున్నాడు విరాట్ కోహ్లీ. 101 డిగ్రీల జ్వరం కూడా విరాట్ కోహ్లీకి సోకిందని చెబుతున్నారు. దీంతో ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే మ్యాచ్ కు విరాట్ కోహ్లీ ఆడబోడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ గాయం నేపథ్యంలో మెరుగైన ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్లాడట విరాట్ కోహ్లీ. అక్కడే దాదాపు వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకోనున్నాడని ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు విరాట్ కోహ్లీని లండ‌న్ పంపించేందుకు స్పెష‌ల్ ప్రైవేట్ జెట్ కూడా ఏర్పాటు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక విరాట్ కోహ్లీ ఆడ‌క‌పోతే, వెంక‌టేష్ అయ్య‌ర్ కు ఛాన్స్ రానున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. ఇక ఇవాళ బెంగ‌ళూరు వ‌ర్సెస్ ల‌క్నో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ చిన్న‌స్వామి వేదిక‌గా జ‌రుగ‌నుంది.

రోహిత్ శర్మకు కూడా గాయం

ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు కూడా గాయమైన సంగతి తెలిసిందే. అతడు కూడా రెండు లేదా మూడు మ్యాచ్లకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. తొడ కండరాల నొప్పితో రోహిత్ శర్మ బాధపడుతున్నాడు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరూ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడకపోతే అమాంతం వ్యూయర్షిప్ పడిపోయే ప్రమాదం ఉంది.

Advertisement

 

Also Read: Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభ‌వ్ కు కూడా ల‌వ్ స్టోరీ…ఔట్ కాగానే క‌న్నీళ్లు పెట్టుకుంది క‌ద‌రా

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×