BigTV English

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

IPS Secret Operation Fail: తప్పు చేసినవాడు.. ఎక్కడో దగ్గర దొరుకుతాడు.. నిందితుల విషయంలో పోలీసులు తరచు చెప్పేమాట. ఈ లాజిక్‌ను మరిచి పోయారు పైన కనిపిస్తున్న ముగ్గురు ఐపీఎస్‌లు. నిందితుల విషయంలో ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా గమనించే ఐపీఎస్‌లు.. సీక్రెట్ ఆపరేషన్‌లో ఎలా దొరికి పోయారు? ఒకరు డీఐజీ స్థాయి అధికారి కాగా, మరొకరు డీజీ ర్యాంకు, ఇంకొకరు ఐజీ ర్యాంకు అధికారి. వీరిలో ఒకరు అప్రూవర్‌గా మారిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసు వర్గాల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి.


ముంబై నటి వ్యవహారం తీగలాడితే డొంక కదులుతోంది. ఈ వ్యవహారంలో చాలా మంది పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఇద్దరు అధికారులు సస్పెండ్ కాగా, తాజా మరో ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల వంతైంది. ఈ జాబితాలో మరో నలుగురు అధికారులున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎస్ అధికారులు సీక్రెట్‌గా సాగించిన ఈ ఆపరేషన్ ఎలా ఫెయిల్ అయ్యింది? అనేదానిపై రకరకాలు చర్చించుకుంటున్నారు.

ముంబై నటి వ్యవహారంపై ముగ్గురు ఐపీఎస్‌లు సీక్రెట్‌గా ఆపరేషన్ చేపట్టారు. ఈ విషయం మూడో కంటికి తెలీకుండా నడుపుకుంటూ వచ్చారు. ఆ తరహా పనులు చేయాలంటే.. ఉన్నతస్థాయి అధికారుల నుంచి పర్మీషన్ తీసుకోవాలి. అదీ చేయలేదు.. విమాన ఛార్జీలు సైతం సొంతంగానే పెట్టుకున్నారు. బిల్లుల క్లెయిమ్ చేయలేదు. సీక్రెట్ ఫండ్ నుంచి ఐపీఎస్‌లు మనీ తీసుకున్న సందర్భాలు లేవు. ఆ తరహా ఫండ్‌కు ఎలాంటి లెక్క ఉండదు. ఇదే వాళ్లని దోషులుగా చేసినట్టు కనిపిస్తోంది.


మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక్కరు మాత్రమే సీక్రెట్ ఫండ్‌ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. దీంతో  అసలు గుట్టంతా బయటపడింది. ఈ ఎపిసోడ్ మొత్తం ఐపీఎస్ అధికారి ఆంజనేయుల చుట్టూ తిరుగు తోంది. ఐపీఎస్‌ల్లో ఒకరు అప్రూవర్‌గా మారినట్టు తెలుస్తోంది. దీంతో తీగలాగితే డొంక కదులుతోంది. అప్పటి మాజీ సలహాదారుడి మెడకు చుట్టుకునే అవకాశమున్నట్లు చిన్నపాటి చర్చ అప్పుడే మొదలైపోయింది.

ALSO READ: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు.  చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత  వీరికి దూరంగా పెట్టింది. ఈ వ్యవహారంపై మాజీ సీఎం జగన్, ప్రధాని మోదీకి సైతం లేఖ రాశారు. అయినా ఫలితం లేకపోయింది.

కొత్త ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న కేసులకు ఆయా అధికారులకు అడ్డంకులు సృష్టిస్తున్నట్లు తేలింది. ప్రతీరోజూ డీజీపీ ఆఫీసు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. వరదల నేపథ్యంలో ఆయా అధికారులు పత్తా లేకుండా పోయారు. సస్పెండయిన అధికారులకు కొద్దిరోజులుగా నిధుల సమస్య వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది సహాయం చేసినట్టు అంతర్గత సమాచారం.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×