BigTV English

Jagan Delhi Protest: వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నాతో చిక్కుల్లో పడ్డారా?

Jagan Delhi Protest: వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నాతో చిక్కుల్లో పడ్డారా?

Is YS Jagan in trouble with Delhi Protest: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నెక్ట్స్ ఏం చేయబోతున్నారు? ఆయన అనుకునేది ఒకటైతే.. జరిగేది మరోలా ఉంది. దీంతో నెక్ట్స్‌ ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే దానిపై కిందా మీదా పడుతున్నారు. ఇంతకీ జగన్‌ ఏం ప్లాన్ చేస్తున్నాడు..? అవి ఎలా బెడిసి కొడుతున్నాయి? జగన్‌ నెక్ట్స్‌ ఎవరిని టార్గెట్ చేయనున్నారు? అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. చెప్పిన రీజన్.. ఏపీలో అధికార పార్టీ నేతల జులుం పెరిగింది. వైసీపీ కార్యకర్తలను అయితే హత్య చేస్తున్నారు.. లేదంటే ఇబ్బంది పెడుతున్నారు. మరి జగన్ అసలు టార్గెట్ ఏంటి? నేషనల్‌ వైడ్‌గా కూటమి ప్రభుత్వ ఇమేజ్‌ను డ్యామేజ్‌ను చేసే ఎత్తుగడ.. దేశం మొత్తం వైసీపీ గురించి చర్చ జరగడం.. ఏపీలో శాంతి, భద్రతలు అదుపులో లేవు.. ఈ ధర్నాను అడ్డం పెట్టుకొని కేంద్ర పెద్దలతో మంతనాలు జరపడం.. కానీ లక్ష్యం నెరవేరిందా? దీనికి ఆన్సరే.. అనుకున్నదొకటి అయితే.. అయ్యింది మరోకటి అనేది..

నిజానికి జగన్ బీజేపీకి అనుకూలంగా ఉంటారు. అది ఆయనకున్న ప్రత్యేక అభిమానమో.. ప్రత్యేక అవసరమో.. రీజన్ ఏంటో తెలియదు కానీ.. బీజేపీ బిల్లులకు ఆయన మద్దతు తెలిపిన ఘటనలు అనేకం.. కానీ ఢిల్లీ ధర్నాలో ఆయన తెలిసి చేశారో.. తెలియక దానంతట అదే జరిగిందో తెలియదు కానీ.. కొన్ని విచిత్ర సంఘటనలు జరిగాయి. అదే.. ఇండీ కూటమి నేతలంతా ఏకపక్షంగా మద్దతు పలికారు. అంటే కాంగ్రెస్‌ పార్టీ నేతలెవరూ రాలేదనుకుఓండి. కానీ కూటమి నేతలు జగన్‌కు మద్దతు తెలపడం అనూహ్యమనే చెప్పాలి. ఇప్పుడీ ఘటనతో జగన్‌కు నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి తీసుకొచ్చింది. ఇండియా కూటమిలో చేరాలని జగన్‌కు ఇన్విటేషన్‌ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై జగన్ స్పందన ఏమిటి అనేది ఇంకా తెలియదు.. ఖచ్చితంగా నో అనే అంటారు. ఎందుకంటే జగన్‌ ఎప్పుడైతే ఇండి కూటమిలో అడుగు పెడతారో.. ఆయనకు సంబంధించిన చాలా ఫైల్స్‌ను కేంద్రం కదలించే అవకాశం ఉంటుంది. దీంతో ఆయన పరిస్థితి ముందుకెళ్తే నుయ్యి.. వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టుగా ఉంటుంది.


Also Read: సముద్రమంత ఆశతో.. ఉప్పాడ ప్రజల ఎదురు చూపులు !

2014 నుంచి జగన్ బీజేపీకి మద్దతుగానే ఉన్నారు. 2014లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నప్పటికీ ఆయన పరోక్షంగా బీజేపీతో సంబంధాలు కొనసాగించారు. కానీ బీజేపీతో పొత్తులు పెట్టుకోలేని పరిస్థితి జగన్‌ది. అందుకే నేరుగా ఎన్డీఏ కూటమిలో చేరలేని పరిస్థితి జగన్‌ది.. నిజానికి ఇండీ కూటమి ఆయనకు ఓటు బ్యాంక్ పరంగా సేఫ్.. కానీ బీజేపీని కాదంటే జరగబోయే పరిణామాల్ని ఎదుర్కోవడం కష్టం. అంతేగాకుండా కాంగ్రెస్‌ వైసీపీకి వెల్‌కమ్‌ చెప్పే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఏపీలో బలపడాలన్నది కాంగ్రెస్ ఆలోచన.. ఇప్పటికే ఆయన చెల్లి.. షర్మిలను రంగంలోకి దించింది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని కూటమిలో చేర్చుకునేందుకు ససేమీరా ఒప్పుకోదు కాంగ్రెస్.. కాబట్టి ఆయన కూటమితో కలిసి అడుగులు వేసే పరిస్థితి లేదు.

ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతిస్తామని గతంలో జగన్ ప్రకటించారు. కానీ ఎన్డీఏ కూటమి వైపు నుంచి ఆయన ఎలాగూ సపోర్టు వచ్చే అవకాశం లేదు. కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నాయి కాబట్టి. మొత్తానికైతే ఢిల్లీ ధర్నాతో ఆయన ఇరుక్కుపోయారనిపిస్తోంది. ఏపీలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం.. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండీ కూటమి నేతల్ని పిలిచి ధర్నా చేశారు. నిజానికి ధర్నా ముగిసిన తర్వాత నాలుగైదు రోజులు ఆయన ఢిల్లీలోనే ఉండాలనుకున్నారు. పలువురు బీజేపీ నేతలను కలిసి మాట్లాడుకున్నారు. కానీ ఇండి కూటమి నేతల ఎంట్రీతో.. ఆయన ఇప్పుడు ప్లాన్ రివర్స్‌ అయ్యింది. దీంతో వెంటనే అమరావతికి వచ్చేశారు.

మరి నెక్ట్స్‌ ఏంటి? జగన్ ఏం చేయబోతున్నారు? వినుకొండ వెళ్లి అక్కడ ఆందోళన చేశారు. అదే అంశంపై ఇప్పుడు ఢిల్లీలో కూడా ఆందోళనలు పూర్తయ్యాయి. మరి నెక్ట్స్ జగన్ ఏ టాపిక్‌ను తీసుకోబోతున్నారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నిత్యం ఏదో టాపిక్‌తో ప్రజల్లో ఉండకపోతే పార్టీ మనుగడ కష్టమయ్యే పరిస్థితి..దీంతో తాడేపల్లిలో ఇప్పటికే వ్యూహరచన కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ శాంతి, భద్రతల ఇష్యూనే తలకెత్తుకొని ప్రజల్లోకి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి ప్రజలు దీనిని ఏమేర రీసివ్ చేసుకుంటారో చూడాలి.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×