BigTV English

Kalki 2898 ad: కల్కి అన్‌స్టాపబుల్.. బాక్సాఫీసు వద్ద మరో ఫీట్.. ఇప్పటికి ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే..?

Kalki 2898 ad: కల్కి అన్‌స్టాపబుల్.. బాక్సాఫీసు వద్ద మరో ఫీట్.. ఇప్పటికి ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే..?

Kalki 2898 ad Latest Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, విజయ్ దేవర కొండ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ నటీ నటులు కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటుగా రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, ఫరియా అబ్దుల్లా వంటి నటీ నటులు గెస్ట్ రోల్‌లో కనిపించి అదరగొట్టేశారు.


జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించిన ఈ కొత్త ప్రపంచాన్ని చూసి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ నుంచి ఇలాంటి విజువల్ వండర్ మూవీ తెరకెక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సినిమాలను కేవలం హాలీవుడ్‌ నుంచి మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలాంటి టాలీవుడ్ నుంచి అలాంటి ఒక మాస్ యాక్షన్ గ్రాఫిక్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా రావడంతో ఖంగుతినన్నారు.

Also Read: రెబెల్స్ ఆఫ్ కల్కి.. మరో యాక్షన్ విజువల్ వండర్ వీడియో రిలీజ్


మొత్తంగా ఈ సినిమా యావత్ సినీ ప్రేక్షకుల్నే కాకుండా ప్రముఖ దర్శకులను సైతం ఆకట్టుకుంది. దీంతో నాగ్ అశ్విన్‌పై ప్రశంసల జల్లు కురిసాయి. అలాగే ఇందులో స్టార్ హీరోలకు తగ్గట్టుగా పాత్రలు క్రియేట్ చేసిన విధానం కూడా అందరినీ అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్‌ బచ్చన్‌ల మధ్య వచ్చిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఇలా సినిమాలో ప్రతి అంశం అందరినీ ఆకట్టుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

మొదటి రోజు రూ.191.5 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా డే 1లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత ఈ సినిమాకు పోటీగా మరే సినిమా లేకపోవడంతో బాక్సాఫీసు వద్ద తన హవా చూపించింది. మధ్యలో ఇండియన్ 2 సినిమా వచ్చినా ఫ్లాప్‌గా నిలవడంతో అంతా కల్కిపైనే ఆసక్తి చూపించారు. అలా మొత్తంగా ఈ సినిమా కేవలం 14 రోజుల్లోనే రూ.1000 కోట్లు క్రాస్ చేసి నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఇక తాజాగా ఈ సినిమా రూ.1100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని తాజాగా మూవీ టీం వెల్లడించింది. అలాగే ఓవర్సీస్‌లో $18 మిలియన్ల క్రాస్ చేసిన కల్కి ఇప్పుడు $20 మిలియన్ల వైపుగా పరుగులు పెడుతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×