BigTV English

Harbhajan Singh reveals: హర్బజన్ మాట.. పాక్‌కు వెళ్లకపోవడమే మంచిది, ఎందుకంటే..

Harbhajan Singh reveals: హర్బజన్ మాట.. పాక్‌కు వెళ్లకపోవడమే మంచిది, ఎందుకంటే..

Harbhajan Singh latest news(Sports news headlines): వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్-టీమిండియా మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరుగుతుందా? టీమిండియా దాయాది దేశం వెళ్తుందా? లేక తటస్థ వేదికపై టోర్నీని నిర్వహిస్తారా? అన్నదానిపై చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. దీనిపై టీమిండియా మాజీ ఆటగాళ్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ జాబితాలో హర్బజన్‌సింగ్ ముందున్నాడు. పాక్‌కు టీమిండియా వెళ్లకపోవడమే మంచిదన్నాడు.


వచ్చేఏడాది పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరగనుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, పలుమార్లు బీసీసీఐని సంప్రదించింది. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది బీసీసీఐ. వెళ్తామా లేదా అన్నదానిపై క్లారిటీ రాలేదు. దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు హర్బజన్‌సింగ్ స్పందించాడు.

ఛాంపియన్స్ షిప్ టోర్నమెంట్‌కు దాయాది దేశానికి భారత్ జట్టు వెళ్లకపోవడమే మంచిందన్నాడు హర్బజన్‌‌సింగ్. ఈ విషయంలో బీసీసీఐ నిర్ణయంతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని బీసీసీఐ సంప్రదించిన తర్వాతే టోర్నీకి వెళ్లేది లేదని తెలుస్తుందన్నాడు.


ALSO READ: ఐపీఎల్‌పై ద్రావిడ్ కొడుకు ఫోకస్, టీ20 వేలంలో…

అసలు పాక్‌లో భారత్ జట్టు ఎందుకు పర్యటించాలని ప్రశ్న వేశాడు భజ్జీ. అక్కడ భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయని, ప్రతీ రోజు అక్కడ ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉందన్నాడు. ఇలాంటి పరిస్థితు ల్లో అక్కడి టీమిండియా వెళ్లడం సురక్షితమైనది కాదని చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లకు భద్రత కంటే మరేదీ ముఖ్యమైనది కాదన్నాడు.

పాక్ మాత్రం భారత జట్టుకు వచ్చిన ఇబ్బంది ఏమీలేదంటోంది. ఆ జట్టు ఆడే అన్ని మ్యాచ్‌లను లాహోర్‌లో ఏర్పాటు చేస్తామని చెబుతోంది. స్టేడియానికి దగ్గరలో ఉన్న హోటల్‌లో స్టే చేయవచ్చని అంటోంది. దగ్గరలోనే ఫైవ్ స్టార్ హోటళ్లను నిర్మిస్తున్నామన్నది పీసీబీ మాట. ఇప్పుడు కాకపోయినా రేపటి రోజునైనా పరిస్థితులు చక్కబడతాయని ఆ దేశ క్రికెట్ బోర్డు అంచనా వేస్తోంది.

దాదాపు పుష్కర కాలం నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరగలేదు. మిగతా సిరీస్‌ల్లోని మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. గతేడాది పాక్‌లో జరగాల్సిన ఆసియా కప్‌కు టీమిండియా వెళ్లలేదు. దీంతో భారత్-పాక్ మధ్య మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగిన విషయం తెల్సిందే.

 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×