BigTV English

Amaravati Farmers Protest: అమరావతిపై కామెంట్స్.. తప్పెవరిది?

Amaravati Farmers Protest: అమరావతిపై కామెంట్స్.. తప్పెవరిది?

నోరుజారితే వెనక్కు తీస్కోవడం కష్టం

కాలు జారినా వెనక్కు తీస్కోగలమేమోగానీ- నోరు జారితే మాత్రం చాలా చాలా కష్టం. అనడానికి కొమ్మినేని వంటి వారి అరెస్టే ఉదాహరణ. ఆయనేం చేశాడు? తప్పంతా? ఆ ఎనలిస్టు కృష్ణంరాజుది కదా? ఇదీ కొందరు వైసీపీ వీరాభిమానులు కొట్టి పడేసేలాంటి మాట. కానీ ఇక్కడ గుర్తించాల్సిన విషయమేంటంటే.. ఎంత పార్టీల కోసం చేసే జర్నలిజం అయినా అందులోనూ డూస్- డోంట్స్ ఉంటాయి.


పిల్లలు- వృద్ధులు- మహిళలు- కులమత- ప్రాంతీయాభిమానాలపై అప్రమత్తం

నిజంగా ఈ ఇద్దరు పెద్ద మనుషులు జర్నలిస్టులే అయితే.. ఫస్ట్ వీరు పిల్లలు- వృద్ధులు- మహిళలు- కులమత- ప్రాంతీయాభిమానాలు అనే విషయంపై ఒక అవగాహన కలిగి ఉండాలి. మనోభావాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని గ్రహించాలి. వాళ్లు నేర్చుకున్నారో లేదో తెలీదు గానీ ఇది జర్నలిజం బేసిక్ థియరీ. ఇదే కొమ్మినేని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గానూ పనిచేశారు. అలాంటి వ్యక్తికి కనీస విచక్షణా జ్ఞానం లేక పోవడమేంటన్నది ఒక ప్రశ్నగా మారింది. ప్రాధమిక అంశాలు గుర్తుండక పోవడమేంటన్నది దీని కొనసాగింపు ప్రశ్న.

ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్- సర్వే

కొమ్మినేని ఏం చేశారు? ఇది ఆయనకు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛ. ఈ మాత్రం కూడా మాట్లాడలేకుంటే.. వాక్ స్వాతంత్రం ఉండి ఉపయోగమేంటి? అన్నది కొందరు ఆయన తరఫు వాదించే వారి ప్రశ్నా పరంపర. నిజమే కాదనడం లేదు. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అనే సర్వే సంస్థ.. క్లియర్ కట్ గా ఒక మెసేజ్ పాస్ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఫిమేల్ సెక్స్ వర్కర్లలో- 20 శాతం మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నట్టు రిపోర్ట్ చేశారు.

కర్ణాటక తర్వాత 12 శాతంతో ఏపీ సెకండ్ ప్లేస్

ఈ మేరకు చూస్తే దక్షిణాదిలో కర్ణాటక తర్వాత ఏపీ 12 శాతంతో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ విషయమే అక్కడ చర్చకు వచ్చింది. ఇందులో కొమ్మినేని చేసిన నేరమేంటి? దానికి తోడు ఈ మేటర్ అనలిస్టు కృష్ణంరాజు చెప్పగా.. ఆయన దాన్ని వారించే యత్నం కూడా చేశారు. కావాలంటే ఆ వీడియో చూడండి అనేవారుండొచ్చు. కొందరు వైసీపీ మద్దతుదారులు. ఈ తరహా సన్నాయి నొక్కులు నొక్కుతుండవచ్చు.

యాదాద్రి అంటే వేశ్యలు తిరగాడే ప్రాంతమంటూ ముద్ర వేసే యత్నం

ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి లో ఇలాగే ప్రక్షాళనచేస్తోంది. ఈ ప్రాంతంలో యాదగిరిగుట్ట టెంపుల్ ఎంత ఫేమస్సో.. సరిగ్గా అలాగే ఇక్కడి వ్యభిచారం కూడా అంతే ఫేమస్. ఇంత పెద్ద ఆలయం కడుతూ.. ఈ కూపమేంటిక్కడ అసహ్యంగా అని భావించిన గులాబీ ప్రభుత్వం ఈ దిశగా ఒక ప్రక్షాళన చేపట్టింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించింది. ఏనాడూ కూడా.. యాదాద్రి అంటే వేశ్యలు తిరగాడే ప్రాంతమంటూ ముద్ర వేసే యత్నం చేయలేదు. మీడియా సైతం కులమతాలకు, ప్రాంతీయాభిమానాలకు అతీతంగా అక్కడేం జరుగుతోందో అది మాత్రమే చెప్పారు. ఎవ్వరూ కూడా ఎలాంటి ఎడిటోరియల్ కామెంట్లు చేయలేదు. ఒక వేళ కొమ్మినేని.. ఈ వార్త తెలిసిన వెంటనే ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు. ఇక్కడే ఆయన అతి పెద్ద తప్పిదం చేసినట్టు భావించాలి.

ఈ వార్తను తనకున్న చనువు ఇతర పరిచయాలతో జగన్ దాకా తీస్కెళ్లొచ్చు

కృష్ణంరాజు ఏపీలో 12 శాతం మంది అలాంటి వారు ఉన్నారన్న వివరాలను చెబుతున్నపుడు.. కొమ్మినేని అన్న మాటేంటంటే తాను కూడా ఇంగ్లీష్ పత్రికల్లో చూశానని అన్నారు. ఒక వేళ ఈ పెద్దాయన నిజంగానే సీనియర్ జర్నలిస్ట్ అయి ఉంటే.. ఈ వార్తను తనకున్న చనువు ఇతర పరిచయాలతో జగన్ దాకా తీస్కెళ్లొచ్చు. తద్వారా ఒక రిహాబిలిటేషన్ కి ఉపక్రమించవచ్చు. కానీ అలా చేశారా? మరి ఇది బాధ్యతా రాహిత్యం కింద కాక మరెలా చూడాలంటారు ఈ ప్రాంత వాసులు.

ఇది స్వయంకృతం కాదా? అన్న ప్రశ్నతనువు పుండై… తాను పండై.. తాను శవమై.. వేరొకరి వశమై.. తను ఎడారై .. ఎందరికో.. ఒయాసిస్సై.. . అంటూ ఆ వర్కర్ల దయనీయ స్థితి గురించి రాస్తారు అలిశెట్టి ప్రభాకర్.

అమరావతిని నిర్లక్ష్యం చేయడంతో పనులు దక్కని స్థితి

వ్యభిచారంలోకి 90 శాతం మంది వరకూ కావాలని రారు. వారి విధిలేని పరిస్థితుల నడుమ ఇలా చేయాల్సివస్తుంది. దానికి తోడు అప్పట్లో అమరావతి అనే రాజధానిని నామరూపాల్లేకుండా చేయడంలో భాగంగా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు నాటి పాలకులు. దీంతో ఇక్కడ ఊపందుకోవల్సిన ఉపాధి కాస్తా పక్కకు తప్పుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఈ వృత్తిలోకి మారి ఉండొచ్చు. ఆ తప్పు తెలుసుకునేలా వ్యవహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

మాకేమీ సంబంధం లేదంటూ కృష్ణంరాజు చేత వీడియో రిలీజ్

కానీ ఆంధ్రుల దురదృష్టవశాత్తూ.. ఇక్కడంతా రివర్స్ లో జరిగింది. ఎలాంటి బాధ్యత లేకుండా వ్యవహరించినట్టు కనిపించింది. ఆ కామెంట్ కి తమకూ ఎలాంటి సంబంధం లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే కాకుండా కృష్ణంరాజు చేత ఒక వీడియో సైతం రిలీజ్ చేయించారు. ఇక్కడే కొమ్మినేనిని నిలదీయాల్సి వస్తోంది. తప్పక అరెస్టు చేయాల్సిందేనంటున్నారు అమరావతి మహిళలు.

ఒక పద్ధతి ప్రకారం అమరావతికి చెడ్డ పేరు తెచ్చే యత్నం

దానికి తోడు ఈ డిబేట్ లో చెప్పినట్టు అమరావతి చుట్టూ అంతలేసి ఆ వర్కర్స్ లేరు. ఈ రిపోర్టులన్నీ తప్పుగా చెబుతారు కొందరు లాయర్లు. ఈ విషయంలో ఒక డేటా సేకరించి మరీ వారు అసలు విషయం కళ్లకు కట్టించారు. ఇదంతా చూస్తుంటే పద్ధతి ప్రకారం ఒక ప్రాంతానికి చెడ్డ పేరు ఆపాదించేలా కనిపిస్తోంది. ఇదే తప్పంటారు కొందరు సామాజిక వేత్తలు.

కృష్ణంరాజును వెనకేసుకొచ్చే యత్నం చేసిన కేఎస్ఆర్

కొమ్మినేని ఒక డిబేట్ నిర్వాహకుడిగా ఉండి కృష్ణంరాజు ఈ విషయం ప్రస్తావిస్తున్నపుడు నిలువరించాలి. దానికి తోడు ఇలాటి సంచలన వ్యవహారాలను వెలుగులోకి తేవడం అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదు. ముందుగానే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. ప్రాక్టీస్ చేస్తారు. ఇరువురూ తామీ విషయం ప్రస్తావించాలని ముందే ఫిక్స్ అయి ఉంటారు. ఇందుకు యాజమాన్యం అనుమతి కూడా తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇక్కడే కొమ్మినేనిని అనుమానించాల్సి వస్తోంది. ఏదోలా అమరావతిపై విషం చిమ్మేద్దాం అనే ఆతృత కొట్టొచ్చినట్టు కనిపించింది ఆయనమాటల్లో. లేకుంటే చూడండి.. మిమ్మల్ని ట్రోల్ చేస్తారని కృష్ణంరాజును వెనకేసుకొచ్చే యత్నం చేశారే తప్ప.. అమరావతిని అంతలేసి మాటలనడం కరెక్టు కాదని స్టాండ్ తీస్కోలేదు. ఈ లెక్కన ఇక్కడ వేశ్యలెవరు సార్!? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

మహిళల పట్ల మరింత నీచంగా సజ్జల కామెంట్లు

ఇదంతా ఇలా ఉంటే గతంలో అన్ని మంత్రిత్వ శాఖలకూ ఏకైక ప్రతినిథిగా పనిచేసిన సజ్జల డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి బదులు మరింత అద్వానంగా, అత్యం హేయంగా, హీనంగా మహిళల పట్ల కాక రేపే మాటలు మాట్లాడారు. దీంతో ఇటు పార్టీని దానికి కొమ్ముకాసే అనుంగు మీడియాను.. ఆ మీడియాలో కీలకంగా పని చేస్తున్న సంపాదకీయ పెద్దలను కానీ తీవ్రంగా తప్పు పట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోందంటారు ఈ ప్రాంత వాసులు.

అనుచిత వ్యాఖ్యలపై కిరణ్ చేబ్రోలును అరెస్టు చేసిన కూటమి ప్రబుత్వం

కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడం కాదు కానీ, ఇదే భారతీ రెడ్డి విషయంలో కిరణ్ చేబ్రోలు అవాకులు చెవాకులు పేలితే.. వెంటనే ఈ ప్రభుత్వం ఏం చేసింది? అతడ్ని ఇమ్మీడియట్‌గా అరెస్టు చేసింది. మహిళల విషయంలో తరతమ బేధాలు పాటించే ప్రసక్తే లేదు. ఎవరినైనా ఎందాకైనా వెళ్లి కఠినంగా శిక్షించడం ఖాయమని తేల్చి చెప్పింది. ఈ విధంగా వీరెక్కడా ప్రయత్నించలేదు దానికి తోడు సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డారు. ఇక్కడే అందరికీ అనుమానమేస్తోంది. ఇదేదో ప్రీప్లాన్డ్ స్క్రీన్ ప్లేగానే భావిస్తున్నారు.

మొన్న కమ్మరావతి, నిన్న బురదావతి, నేడు వేశ్యావతా?

ఒక సమయంలో కమ్మరావతిగా, మరో సమయంలో బురదావతిగా.. ఇప్పుడు చూస్తే వేశ్యావతిగా.. ఏంటిది? ఒక ప్రాంతం పట్ల ఇంత దారుణంగా బురదజల్లడమేంటి? అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతవాసులైతే రేపటిరోజున తమ ప్రాంతంపై ఇంకేం ముద్ర వేస్తారోనని హడలిపోతున్నారు.

2024లో అమరావతే రాజధానిగా ప్రజల తీర్పు

ఆంధ్ర ప్రజలు 2024 ఎన్నికల్లో స్పష్టంగా ఒక తీర్పునైతే ఇచ్చారు. అమరావతే తమ రాజధానిగా ఉండాలని వారొక అల్టిమేటం జారీ చేశారు. ఈ సారికి తాము గెలిస్తే మూడు రాజధానులు తెస్తామని ఎన్నికల ముందుకొచ్చిన జగన్అండ్ కో కి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. 151 సీట్లకుగానూ 11 సీట్లు మాత్రమే మిగిలాయ్. ఈ కండీషన్లో వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకుని మేము సైతం అమరావతికే జై అంటామని స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. కానీ అలా జరిగిందా? అంటే అదే తెలీడంలేదు. ఈ మధ్యకాలంలో మాజీ మంత్రిజోగి రమేష్ ఒక్కరు తప్పయిపోయింది. ఈ సారికి తాము గెలిస్తే అమరావతినే రాజధానిగా ఒప్పుకుంటామని అన్నారు. ఓకే వీరిలో ఒక మార్పు వస్తున్నట్టే ఉందని భావించేలోపు.. ఈ పిడుగు. అంటే వీరికింకా సుతరాయించలేదన్న మాట వెలుగు చూస్తోంది.

ఈ మధ్య మాజీమంత్రి జోగి రమేష్ నుంచి రియలైజేషన్

గతంలో నారా భువనేశ్వరి విషయంలో వల్లభనేని వంశి మాటలు ఎంత చేటు తెచ్చాయన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అప్పుడు వంశీ ఒక్క మహిళతో సరిపెడితే.. ఇప్పుడీ ఇద్దరు ప్రబుద్ధులు ఏకంగా ఒక జాతి మీదే అభాండం వేసే యత్నం చేశారు. ఇక్కడి వారందరికీ వ్యభిచార మకిలి అంటించే యత్నంచేశారు. పదే పదే ఇలాంటి తప్పులే ఎందుకు చేస్తున్నట్టు? ఇక్కడ కులాలు- మతాలు- ప్రాంతాలు- పార్టీలు- జెండాలు- అజెండాలు పక్కన పెడతాం. ఒక ప్రాంతం మీద, దాని వ్యక్తిత్వం మీద ఇలాంటి ముద్ర వేయడం కరెక్టేనా? ఇలా ఎందుకు ఆలోచించడం లేదని నిలదీస్తారిక్కడి వారు.

ఏకంగా ఒక జాతి మీదే అభాండం వేసే యత్నమా?

ఒక రకంగా చెబితే ఇక్కడే తమ ఘోరీ తాము కట్టుకుంటున్నారు. కొన్ని విషయాల్లో నిజాయితీ ఎంతో మేలు చేస్తుందన్న మాటే మరుస్తున్నారు. ఒక ప్రాంతానికి లేని పోని ఆపాదనలు చేయడానికి ఇంత బరితెగిండం సరికాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికన్నా మంచి విషయం ఏంటంటే ఈ కేరెక్టర్ అసాసినేషన్ పక్కన పెట్టి.. రేపటి రోజున మేమొస్తే అమరావతిని రాజధానిగా ఒప్పుకోం అని స్పష్టంగా చెప్పి ఉండాల్సింది. ఇష్టపడ్డవారు ఓట్లు వేస్తే వేశారు. లేకుంటే పోతారన్న మాట వినిపిస్తోంది.

ఒక ప్రాంత వ్యక్తిత్వంపై ఇలాంటి కామెంట్ కరెక్టేనా?

రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ కావచ్చు.. తమ సీనియారిటీని పణంగా పెడుతున్న కొమ్మినేని వంటి జర్నలిస్టులు కావచ్చు.. చేస్తున్న తప్పేంటంటే.. తామెంతో తెలివిగా ఒక ప్రాంతం మీద ముద్ర వేస్తున్నామని భావిస్తుండ వచ్చు.. కానీ అది వారి వారి రాజకీయ, జర్నలిస్టిక్ జీవితానికే చరమగీతం పలుకుతుందని గుర్తించక పోవడం విడ్డూరంగా ఉందంటున్నారు.. పలువురు ఎనలిస్టులు.

ఇది స్వయంకృతం కాదా? అన్న ప్రశ్న

ఇప్పుడీ సిట్యువేషన్ ఎక్కడి వరకూ వెళ్లిందంటే సాక్షి పత్రికాఫీసులపై దాడులకు తెగబడే వరకూ. అంతేనా సాక్షి పత్రికా లైసెన్సు రద్దు చేయమని కోరే వరకూ వెళ్లింది వ్యవహారం. మరిది స్వయంకృతాపరాధం కాదా? ఇంకా సమర్ధించుకోవడమేంటి? అన్నది కొందరు ప్రశ్నిస్తున్న విధం.

Story By Adinarayana, Bigtv Live

 

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×