Biker Movie: డైరెక్టర్ అభిలాష్ (Abhilash) దర్శకత్వంలో శర్వానంద్(Sharwanand) మాళవిక నాయర్(Malavika Nayar) జంటగా నటిస్తున్న తాజా చిత్రం బైకర్(Biker). ఈ సినిమా డిసెంబర్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ అభిలాష్ మాట్లాడుతూ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయడమే కాకుండా సినిమా విషయంలో ఎంతో ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు బైక్ రేస్ కి సంబంధించిన నేపథ్యంలో తెలుగులో ఎలాంటి సినిమాలు రాలేదని డైరెక్టర్ అభిలాష పేర్కొన్నారు. ఇటీవల కాలంలో మీరు రేసింగ్ ఫిలిమ్స్ చూసి ఎగ్జిట్ అయి ఉంటారు ఆ సినిమా కంటే ఒక పర్సెంట్ ఎక్కువగానే మా బైకర్ సినిమా ఉంటుందని పరోక్షంగా ఈయన ఎఫ్ 1 సినిమా గురించి మాట్లాడారని తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో మా వైపు నుంచి పూర్తి ధీమాతో ఉన్నామని కచ్చితంగా డిసెంబర్ 6వ తేదీ హిట్ కొడుతున్నాము అంటూ ఈయన కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ అభిలాష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బైకర్ సినిమా గురించి గొప్పగా చెప్పడంలో తప్పులేదు కానీ ఏకంగా వంద కోట్లు రాబట్టిన సినిమా కంటే కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పడంతో పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ అంత కాన్ఫిడెంట్ ఏంటి భయ్యా తేడా కొట్టిందో అంతే సంగతులు అంటూ డైరెక్టర్ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. ఇలా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల దర్శక నిర్మాతలు పెద్ద ఎత్తున చాలెంజ్ చేయడం తీరా సినిమా విడుదలైన తర్వాత ఎన్నో విమర్శలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక తాజాగా అభిలాష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఎఫ్1 రీమేక్ చేయబోతున్నారా..
హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ నటించిన “ఎఫ్1” ప్రేక్షకుల ముందుకు వచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకి పైగా రాబట్టి అదరగొట్టింది. అయితే ఈ సినిమాకి ఇండియన్ వెర్షన్ గా రీమేక్ చేస్తే ఎవరు సూట్ అవుతారనే చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ సినిమాను రీమేక్ చేయాలంటే కచ్చితంగా కోలీవుడ్ హీరో అజిత్(Ajith) అయితే సరిగ్గా సరిపోతారని అభిమానులు కూడా భావించారు మరి అజిత్ ఈ సినిమాని రీమేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది అయితే అజిత్ కూడా రేసింగ్ అంటే ఎంతో ఇష్టపడతారు కనుక ఈ సినిమా రీమేక్ చేయడానికి సూట్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు.. మరి డిసెంబర్ 6వ తేదీ విడుదల కాబోయే బైకర్ సినిమా ఎఫ్ 1 సినిమాని బీట్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.