E-Paper
Advertisement

విజయవాడకు రిలీఫ్.. ఇక రాయనపాడు రైల్వేస్టేషన్ వంతు, జర్నీ మరింత వేగవంతం

విజయవాడకు రిలీఫ్.. ఇక రాయనపాడు రైల్వేస్టేషన్ వంతు, జర్నీ మరింత వేగవంతం
Advertisement

Rayanapadu Railway Station: ఏపీలో కొత్త మూడు రైల్వేస్టేషన్లను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వాటిలో విజయవాడ సమీపంలోని రాయనపాడు, గుంటూరు జిల్లా మంగళగిరి, మార్కాపురం జిల్లాలోని కంభం రైల్వేస్టేషన్లు ఉన్నాయి. నేటి నుంచి ఆయా స్టేషన్లు పూర్తి వసతులతో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక సదుపాయాలు, సకల హంగులతో వాటిని తీర్చిదిద్దారు.

విజయవాడకు రిలీఫ్-అమృత్‌ భారత్‌ పథకం కింద ఏపీలో మూడు రైల్వే స్టేషన్లను పునరుద్దరణ చేసింది కేంద్రం. ఈ పథకం ఏపీలోని 73 స్టేషన్లలో పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోదగినది రాయనపాడు. దేశంలో అత్యంత రద్దీ రైల్వేస్టేషన్ విజయవాడకు అతి సమీపంలో ఉంటుంది. పూర్తి స్థాయి హంగులతో రాయనపాడు రైల్వేస్టేషన్‌ను పునరుద్ధరించారు. అందుకోసం . 35 కోట్లు ఖర్చు చేసింది రైల్వేశాఖ.

Advertisement

రాయనపాడు రైల్వేస్టేషన్ వంతు,  విజయవాడకు అతి దగ్గరలో ఉన్న స్టేషన్. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు నేరుగా విజయవాడకు రాకుండా బైపాస్ చేసేలా రాయనపాడు స్టేషన్‌ను తీర్చిదిద్దారు. ఒక్కమాటలో చెప్పాలంటే శాటిలైట్ రైల్వేస్టేషన్‌ కూడా. గతంలో విజయవాడ స్టేషన్ ఒక్కటే కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను దాదాపు అరగంట సేపు నిలిచిపోయేవి. ఆ రైళ్లు వెళ్లే వరకు శివారులో ప్రాంతాల్లో మిగతా రైళ్లను ఆపేశారు.

20 రైళ్లకు పెంచాలని అధికారుల ఆలోచన-రాయనపాడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో మిగతా రైళ్లు అటువైపు మీదుగా మళ్లించనున్నారు రైల్వే అధికారులు. చెన్నై, నాగపూర్ మీదుగా ఢిల్లీ వెళ్లే రైళ్లను రాయలపాడు మీదుగా వెళ్లేలా ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ టు విశాఖపట్నం వెళ్లే రైలును రాయనపాడు మీదుగా నడుపుతున్నారు. ఓవరాల్‌గా ఈ రైల్వేస్టేషన్‌ మీదుగా 10 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ సంఖ్యను 20 కి పెంచాలని ఆలోచన చేస్తున్నారు.

Advertisement

దీనివల్ల విజయవాడ రైల్వేస్టేషన్‌పై కొంత ఒత్తిడి తగ్గనుంది. ప్రయాణికులు తమ డెస్టినేషన్‌కు రైట్ టైమ్‌లో చేరుకోవచ్చు. రైళ్లు ఆలస్యమైనా ప్రయాణికులు ఇబ్బంది లేకుండా సకల వసతులతో తీర్చిదిద్దారు. ప్రీ-పెయిడ్ వెయిటింగ్ హాల్, దివ్యాంగులకు ప్రత్యేకంగా లిఫ్ట్ లు ఏర్పాటు చేశారు. రెండు లిఫ్టులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే చూపులేని వారికి ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు.

ALSO READ: అంతరిక్షంలోకి హైదరాబాద్ రాకెట్ ‘విక్రమ్ 1’ – దీని ప్రత్యేకతలు ఇవే!

మరొకటి గుంటూరు డివిజన్‌లోని అమరావతికి ముఖ ద్వారంగా మంగళగిరి రైల్వేస్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ స్టేషన్‌కు ఇరువైపులా గేట్లు ఏర్పాటు చేశారు. సకల వసతులు ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లా కంభం రైల్వేస్టేషన్ ఒకటి. కంభం స్టేషన్ పునరుద్ధరణకు రూ. 11 కోట్లు ఖర్చు చేసింది.

Related News

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు

గోదావరి నీళ్లు నల్లమల సాగర్‌కు రావాలి.. మాట ఇచ్చాను, ప్రాజెక్టు పూర్తి చేశాం-సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×