E-Paper
Advertisement

Jagan: డీఎస్సీ ఉద్యోగాలు ఇష్యూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం, జగన్ నోట జెన్ జీ, కాక్రోచెస్

Jagan: డీఎస్సీ ఉద్యోగాలు  ఇష్యూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం, జగన్ నోట జెన్ జీ, కాక్రోచెస్
Advertisement

Jagan:  చంద్రబాబు ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. లక్షలాది మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేశారంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఏపీలో జరిగిన డీఎస్సీ అవకతవకలపై కూటమి ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు.

డీఎస్సీ ఉద్యోగాల వ్యవహారం.. ఆపై జగన్ షాకింగ్ కామెంట్స్

Advertisement

గురువారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు వైసీపీ అధినేత జగన్. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా డీఎస్సీ ఉద్యోగాల వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఉద్యోగాల భర్తీపై విద్యాశాఖ అధికారులు రోజు తప్పించి రోజు వైసీపీ లేవనెత్తిన అంశాలపై రిప్లై ఇస్తున్నారు.

మళ్లీ అదే విషయాన్ని తెరపైకి తెచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టే ప్రయత్నం చేశారు. ఒక అబద్ధానికి, ఒక మోసానికి, ఒక వెన్నుపోటుకి, ఒక దగాకి, ఒక స్కామ్‌కి చొక్కా, ప్యాంటు గనక తగిలిస్తే కనిపించేది సీఎం చంద్రబాబేనని అన్నారు. ఆయన రాజకీయ జీవితం చూసినా, ఈ రెండేళ్లలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు చూసినా, ఆ పార్టీ మేనిఫెస్టోలు లోతుగా చూసినా, టీచర్లు రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేవి ఇవేన్నారు.

Advertisement

చంద్రబాబు ప్రభుత్వంపై రుసరుసలు.. చరిత్ర మాదేనని వ్యాఖ్య

అంతేకాదు మెగా డీఎస్సీ ఘనత మాదేనని చెప్పుకునే ప్రయత్నం చేశారు. మెగా డీఎస్సీ అని చెప్పే కూటమి ప్రభుత్వం, అందులో 6 వేల పోస్టులకు వైసీపీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. వాటిని రద్దు చేసి వాటిని మెగా డీఎస్సీలో కలిపేశారని అన్నారు. ఇది మెగా అనే జాబితాలోకి ఎక్కడా రాదన్నారు. మెగా డీఎస్సీ పేరుతో 16 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ చూస్తే ఎంత మంది ఆవేదనతో ఉన్నారో కంటికి కనిపిస్తుందన్నారు.

వైసీపీ హయాంలో 1.31లక్షల ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేయడం దేశ చరిత్రలో రికార్డు అని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. డీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో వెలుగులోకి వస్తున్న విషయాలు చూస్తుంటే షాక్‌ అయ్యేలా ఉన్నాయని ఆరోపించారు. లక్షలాది మంది అభ్యర్థుల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ము చేసిందని తూర్పారబట్టారు.

ALSO READ: అమరావతికి రానున్న GIIS విద్యాసంస్థ.. 4 ఎకరాల్లో క్యాంపస్, రూ. 300 కోట్ల పెట్టుబడి

స్కాములు చేస్తూ, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిందని మండిపడ్డారు. ఇంత ఘోరంగా రిక్రూట్‌మెంట్‌ చేయడమన్నది ఎప్పుడూ, ఎక్కడా చూడలేదన్నారు. డీఎస్సీ అంటే లక్షల మంది యువత ఆశ, వారి భవిష్యత్ అని అలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియలో అవినీతి, అక్రమాలకు పాల్పడడం అత్యంత దారుణమన్నారు. జన్ జీ ఆశయాలను నలిపేస్తే కోట్లాది కాక్రోచ్‌‌లు వస్తాయన్నారు. అందులో జగన్ కూడా ఒకరు కావచ్చని చెప్పకనే చెప్పారు.

 

 

Related News

మడ అడవుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ రికార్డు.. అటవీ శాఖకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి.. ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

డీఎస్సీ లీకులు.. విద్యాదీవెనకు దిక్కులేదు.. కూటమి పాలనపై బొత్స సంచలన కామెంట్స్!

తిరువణ్ణామలై కొండపై మరో దారుణం.. ఇరుకైన రంధ్రంలో చిక్కుకున్న మహిళా భక్తురాలు!

పోలవరం స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత!

అంబటితో వేదిక పంచుకున్న బోండా ఉమా.. చంద్రబాబు రియాక్షన్ చూస్తే మైండ్ బ్లాకే!

ఏమరుపాటు వద్దు.. టార్గెట్ నెలన్నర- సీఎం చంద్రబాబు

వైఎస్ షర్మిలకు ఆపరేషన్.. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్, అన్నయ్య వచ్చారా?

Big Stories

Advertisement
×