Vijayawada: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఏం జరిగింది? ఆమె ఆపరేషన్ వెనుక కారణమేంటి? ఈ విషయం జగన్‌కు తెలుసా? చెల్లి ఆరోగ్యం గురించి తెలీదా? ఇంతకీ షర్మిల ఆపరేషన్ వెనుక ఏం జరిగింది? షర్మిలకు సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది.
వైఎస్ షర్మిలకు ఆపరేషన్- ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆపరేషన్ చేయించుకున్నారు. ఆసుపత్రిలోని బెడ్‌పై ట్రీట్మెంట్ పొందుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేశారు. తన ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తకావడంతో ఊహాగానాలకు తెరదించారు. తన ఆరోగ్య పరిస్థితిపై షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు.
ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్- పొత్తి కడుపుకు సంబంధించిన ఆపరేషన్ జరిగిందని రాసుకొచ్చారు. వేగంగా కోలుకుంటున్నానని అందులో రాసుకొచ్చాడు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమయంలో తనకు ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రేమ, ఆదరణ, ఆశీస్సులు కొండంత బలాన్నిచ్చాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
త్వరగా కోలుకోవాలని అభిమానులు విషెస్- ఇంతవరకు బాగానే ఉంది. షర్మిల చేసిన పోస్టుపై అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అక్క త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నామని, మళ్లీ ప్రజల మద్యకు వచ్చి ప్రజా సమస్యలపైన మీ గళం వినిపించాలని కోరుతున్నారు. నీ రాక కోసం మేమంతా ఎదురు చూస్తున్నామని మరి కొందరు పెట్టారు.
ALSO READ: ఓపెనింగ్‌కు భోగాపురం ఎయిర్‌పోర్టు రెడీ.. 17 నుంచి రాకపోకలు మొదలు
ఇంకొందరు షర్మిల ఆపరేషన్ గురించి అన్నయ్య జగన్‌కు తెలుసా? తెలిసే రాలేదా? ఆనాడు పాదయాత్ర చేయడం వల్లే మీరు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారని కామెంట్స్ చేస్తున్నారు. ఆనాడు ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు ఈ కష్టాలు వచ్చేవి కావని అంటున్నారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు.
I’m happy to share that I’m recovering well from the necessary abdominal surgery I recently had.
A big thank you to all my well-wishers for your kind thoughts and support. pic.twitter.com/WZgk6FmSRs— YS Sharmila (@realyssharmila) July 26, 2026