Tollywood Singers : తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు హిట్ అవ్వడానికి స్టోరీ ఎంత ముఖ్యమో అంతకు మించి పాటలు మ్యూజిక్ కూడా ముఖ్యమే.. సినిమా రిలీజ్ అవ్వక ముందు ఆ మూవీ నుంచి పాటలు విడుదలై మంచి టాక్ ను అందుకుంటున్నాయి. సినిమాకు స్టోరీ తో పాటలు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి హిట్ సినిమాల్లో పాటలు ఏ రేంజులో హిట్ అవుతున్నాయో చూస్తున్నాం. ఈ పాటలు ఇంతగా హిట్ అవ్వడానికి కారణం పాటలను గుండెలకు హత్తుకొనేలా, చెవులకు వినసొంపుగా ఉండటానికి ఆ పాటలు పాడిన సింగర్స్ కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎంతో మంది స్టార్ సింగర్స్ ఉన్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో పాటకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మరి ఏ సింగర్ ఎంత తీసుకుంటున్నారో ఒకసారి చూసేద్దాం..
సంగీతంతో రాళ్లు కరుగుతాయని అంటారు. కొందరు సాంగ్స్ వింటే ఈ ప్రపంచాన్నే మైమరచిపోతుంటారు. మ్యూజిక్ అంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో పెరిగే పెట్స్ కి కూడా మ్యూజిక్ అంటే మహా ఇష్టం. అలాగే చిన్న పిల్లలకు మధుర స్వరంతో పాటలను పాడి వినిపిస్తే.. హాయిగా అన్నం తినేస్తారు, ప్రశాంతంగా నిద్రపోతారు. ఇక సినీ ఇండస్ట్రీ లో ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి రావాలంటే పాటలు హిట్ అవ్వాల్సిందే. మరి అంత అద్భుతమైన ఈ పాటల్ని పాడే సింగర్స్ కూడా సెలబ్రిటీలే. వారు పాడిన ఒక్కో పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో అని తెలుసుకోవాలని వాళ్ళ ఫ్యాన్స్ గూగుల్ తెగ వెతికేస్తుంటారు. మరి టాలీవుడ్ లో ఏ సింగర్ ఎంత తీసుకుంటారో ఒకసారి చూద్దాం..
సంగీత సరస్వతి పుత్రుడు సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం తాను పాడే ఒక పాటకు లక్ష రూపాయలు ఛార్జ్ చేసేవారట. అలాగే సింగర్ చిత్ర కూడా లక్ష రూపాయలు తీసుకుంటారు.. అలాగే సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వివాదాస్పద బ్యూటీ సింగర్ చిన్మయి కూడా ఒక పాటకు లక్ష రూపాయలు తీసుకుంటుందట. అలాగే సునీత 75 వేల రూపాయలు, సింగర్ రమ్య బెహ్ర 35000, కౌసల్య 45000, హేమచంద్ర 40000, గీతా మాధురి 45000, శ్రావణ భార్గవి 50000, గీతా మాధురి 70000, మంగ్లీ అయితే ఒక్కో పాటకు రెండు, మూడు లక్షలకు తీసుకుంటుందని టాక్.. ఇక మేల్ సింగర్స్ లో కూడా లక్షలు తీసుకుంటున్నారు. లక్ష అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు సినిమాను బట్టి చార్జ్ చేస్తున్నారు. టాలీవుడ్ సినీ వర్గాల టాక్. ఇక సింగర్స్ గా వారు పాడే పాటలపైనే రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సింగర్స్ ఎంతోమంది ఉన్నారు. అలాగే అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ తన అద్భుతమైన గొంతు తో మ్యాజిక్ చేస్తున్న సిద్ శ్రీరామ్ అందరి కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కార్తిక్ కూడా.. వీళ్ళతో పాటుగా చాలా మంది ఫేమస్ సింగర్స్ కూడా ఉన్నారు..