Amaravati: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. రేపో మాపో రాజకీయ పార్టీల ముఖ్యనేతలు.. తమ నాయకులతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా అధికార పార్టీ.. తమ నేతలకు దిశానిర్ధేశం చేయనుంది. ఈ విషయంలో వైసీపీ మాటేంటి? నేతలకు నోటీసుల విషయంలో జగన్ వెనక్కి తగ్గాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అంతా సర్దుకుంటుందని భావిస్తున్నారట.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఎన్నికల తర్వాత తమ పార్టీ నేతలతో భేటీలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీలు తమ తమ నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత నేతలు యాక్టివ్ కావాలని సంకేతాలు ఇవ్వనున్నారు. కొందరి నేతల విషయంలో సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
కార్పొరేషన్, మున్సిపాలిటీ, జెడ్పీ ఎన్నికల్లో సహకరించని నేతలకు నోటీసులు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ విషయంలో ఆయన వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. పులివెందుల గ్రామం, మండలం, మున్సిపాలిటీ, కార్పొరేషన్, జెడ్పీ పీఠం కూడా టీడీపీ దక్కించు కుంది. ఈ విషయంలో పార్టీ నేతలకు నోటీసులు ఇస్తే.. ప్రత్యర్థులకు మరొక అస్త్రాన్ని ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారట.