SAP Layoffs: ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ పరంపరం కంటిన్యూ అవుతోంది. ఒక కంపెనీ తర్వాత మరొక కంపెనీలు లేఆఫ్స్ బాటలో నడుస్తున్నాయి. తాజాగా ఎస్ఏపీ వంతు అయ్యింది. ఆ కంపెనీ తన అన్ని విభాగాల్లో దాదాపు 10 వేల మందిని తొలగించాలని భావిస్తోందని సమాచారం. అదే జరిగితే ఆ కంపెనీ సిబ్బందిలో ఆ సంఖ్య కేవలం 9 శాతం అన్నమాట.
అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఐరోపాలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ SAP లేఆఫ్స్ రెడీ అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు అనుగుణంగా తన వ్యాపారాన్ని మార్చాలని ఆలోచన చేస్తోంది. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆ కంపెనీ తన సిబ్బందిలో దాదాపు 10,000 ఉద్యోగాలు తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తొలగింపులు కంపెనీ ప్రపంచ వ్యాప్త ఉద్యోగులలో కనీసం 9 శాతం మందిని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.
ఉద్యోగాల కోతకు సంబంధించిన సంఖ్య ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం ఆ కంపెనీ యాజమాన్యం కార్మిక ప్రతినిధులతో చర్చలు జరుపు తోంది. ఆ తర్వాత సంఖ్య మారే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం SAP కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 1,10,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తమ కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లలో ఏఐ టెక్నాలజీని అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుందని సీఈవో అన్నట్లు తెలుస్తోంది.
ఏఐ ఆధారిత ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అందుకు అనుగుణంగా వ్యాపారాన్ని మార్చేందుకు రెడీ అవుతోంది. ఖర్చులను నియంత్రించడం కూడా పునర్ వ్యవస్థీకరణ ఒక భాగం. ముఖ్యంగా ప్రొడక్ట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాలపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు ఆ కంపెనీ వర్గాల మాట. జులైలో ఏఐ సంబంధిత పోస్టులు మినహా కొత్త నియామకాలను తాత్కాలికంగా నిలిపివేసింది సదరు కంపెనీ.
ALSO READ: బిగ్ స్క్రీన్ మ్యాజిక్..ఇండియాలో హిసెన్స్ E7S మినీ ఎల్ఈడీ టీవీలు లాంచ్!
అదే సమయంలో కంపెనీ పైస్థాయిలో మార్పులు జరుగుతున్నాయి. ప్రొడక్ట్ హెడ్, సేల్స్ హెడ్ వంటి అధికారులు ఆ సంస్థను వీడడం ఇదొక కారణంగా చెబుతున్నారు. పైన చెప్పినట్టు జరిగితే మూడేళ్లలో ఎస్ఏపీకి సెకండ్ లేఆఫ్స్ కానుంది. రెండేళ్ల కిందట దాదాపు 9,000 నుంచి 10 వేల ఉద్యోగులను తొలగించారు.