AP Panchayat Election Result-2026: ఏపీలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, జెడ్పీ ఎన్నికలే కాదు.. పంచాయతీ ఎన్నికల్లో కూటమి జోరు కొనసాగుతోంది. మూడింట రెండు వంతులు పంచాయతీలను కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. అధికారం పోయినా గ్రామాల్లో తమ పట్టు సడల్లేదని నిరూపించింది వైసీపీ.
ఏపీలోని పంచాయతీ ఎన్నికల్లో కూటమి మద్దతుదారుల జోరు కొనసాగుతోంది. పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. కూటమి మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మూడొంతులకుగాను దాదాపు రెండొంతుల సీట్లను దక్కించు కున్నారు. కూటమి నేతలు సంభరాల్లో మునిగి తేలుతున్నారు. పల్లెల్లో తాము బలంగా ఉన్నామని నిరూపించింది వైసీపీ. ఒక వంతు సీట్లను ఫ్యాన్ పార్టీ గెలుచుకోవడంతో నేతలు ఆనందంలో ముగిని తేలుతున్నారు. కాకపోతే కొన్నిచోట్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రుల సొంత గ్రామాల్లో నేతలకు చుక్కెదురైంది.
ఏపీలో గురువారం తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 3189 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కూటమి మద్దతుదారులు 1835 చోట్ల గెలుపొందారు. అందులో మద్దతుదారులు 1661 చోట్ల కాగా, జనసేన సానుభూతిపరులు 150 చోట్ల విజయం సాధించారు. ఇక బీజేపీ మద్దతుదారులు 24 పంచాయతీల్లో పాగా వేశారు. ప్రతిపక్షం వైసీపీ మద్దతుదారులు 906 పంచాయతీలను గెలుచుకున్నారు. ఇతరుల హవా కూడా కొనసాగింది. వారు కూడా 113 పంచాయతీలను దక్కించుకున్నారు.