E-Paper
Advertisement

క‌ళ్ల‌జోడు పెట్టుకుని క‌న్నీళ్ల‌ను మ‌హ్మ‌ద్ సిరాజ్ క‌వ‌ర్ చేస్తున్నాడు..!

క‌ళ్ల‌జోడు పెట్టుకుని క‌న్నీళ్ల‌ను మ‌హ్మ‌ద్ సిరాజ్ క‌వ‌ర్ చేస్తున్నాడు..!
Advertisement

Mohammed Siraj is crying:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 2nd Test) మధ్య క్రైస్ట్‌చర్చ్ లోని హ్యాగ్లీ ఓవల్ వేదిక‌గా (Hagley Oval, Christchurch) రెండో టెస్టు షురూ అయింది. ఇవాళ ఉదయం 3:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మరోసారి మహమ్మద్ సిరాజ్ కు నిరాశ ఎదురయింది. రెండో టెస్టులోనూ అతనికి ఛాన్స్ ఇవ్వకుండా గౌతమ్ గంభీర్, గిల్ పక్కన పెట్టేశారు. అటు రవీంద్ర జడేజాను కూడా క‌రివేపాకులా తీసేశారు. ఈ క్రమంలో టీమిండియా యాజమాన్యంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. తోపు ప్లేయ‌ర్ల‌ను ప‌క్క‌కు పెట్టి గంభీర్, గిల్ మ‌ళ్లీ త‌ప్పులు చేశారంటూ ఫైర్ అవుతున్నారు.

రెండో టెస్టు ఆడ‌కుండా చేసి గంభీరే టార్చ‌ర్ పెడుతున్నాడు!

క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ ను పక్కకు పెట్టడంపై మాజీ క్రికెటర్లు మురళీ కార్తీక్ ( Murali Kartik), అజింక్య రహనే (Ajinkya Rahane) ఆగ్రహం వ్యక్తం చేశారు. మహమ్మద్ సిరాజ్ ను పక్కకు పెట్టడం చాలా అన్యాయం అంటూ వెల్లడించారు. ఇటు మహమ్మద్ సిరాజ్ కూడా గిల్, గంభీర్ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నాడని పేర్కొన్నారు. వాళ్ళు చేస్తున్న టార్చర్ భరించలేక మహమ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కన్నీళ్లను కవర్ చేసుకునేందుకు కళ్ళజోడు పెట్టుకున్నట్టు బాంబు పేల్చారు.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

గౌతమ్ గంభీర్ పెడుతున్న టార్చర్ కు ప్రతి ఒక్కరికి కన్నీళ్లు రావడం సహజమైనని మురళీ కార్తీక్ వెల్లడించాడు. వెస్టిండీస్ సిరీస్ సమయంలో కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారని మండిపడ్డాడు. కివీస్ తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా సెలెక్ట్ చేసి చివరి మ్యాచ్ లో ఆడించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించాడు. ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ కు కూడా సెలెక్ట్ చేసి రెండింటిలోనూ రిజర్వ్ బెంచ్ పైన కూర్చోబెడితే.. కన్నీళ్లు పెట్టుకోక ఇంకేం చేస్తాడని ప్రశ్నించాడు. మహమ్మద్ సిరాజ్ స్థానంలో ఎవరున్నా ఎమోషనల్ కావాల్సిందేనని కీలక వ్యాఖ్యలు చేశాడు మురళి కార్తీక్. దీంతో వీళ్ళు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండ‌గా, మ‌హ్మ‌ద్ సిరాజ్ ను కాద‌ని ప్ర‌సిద్ కృష్ట స్థానంలో గుర్నూర్ బ్రార్ కు అవకాశం ఇచ్చారు.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

 

Related News

గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా బూతు పురాణం.. బ్యాన్ వేయాలంటూ డిమాండ్లు

శ్రీలంకపై వైభవ్ సెంచరీ చేసుంటే ట్రోలింగ్ ఆపేవాళ్లం, కానీ ఇప్పుడు రెచ్చిపోతాం

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అంపైర్ నితిన్ మీనన్..? సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాములుగా లేదుగా

పాకిస్తాన్ మీడియాను బాయ్ కాట్ చేసిన‌ బాబ‌ర్ ఆజం.. దేశ‌ద్రోహి అంటూ రివ‌ర్స్ ఎటాక్

వైభ‌వ్ నాకు కొడుకు లాంటోడు…200 బాదాక‌ యువ‌రాజ్ పేరు చెప్పి కొంప‌ముంచాడు

వైభ‌వ్ మ‌నిషి కాదు, వాడు సిక్స‌ర్ల‌ రాక్ష‌సుడు.. వ‌న్డేల్లో 300 క‌చ్చితంగా కొడ‌తాడు

అంబానీ బిజినెస్ మైండ్..జైస్వాల్, ఆర్చ‌ర్ కోసం హార్దిక్ పాండ్యా ఎర‌గా వాడేశారుగా!

Big Stories

Advertisement
×