E-Paper
Advertisement

Amaravati: కట్టారంటే కటకటాల్లోకే.. జగన్ బెదిరింపులు, ఈ సారి..

Amaravati: కట్టారంటే కటకటాల్లోకే.. జగన్ బెదిరింపులు, ఈ సారి..
Advertisement

Amaravati: చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీలో వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయని ఆరోపించారు మాజీ సీఎం జగన్. అధికారుల పని తీరు బాగా లేదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు స్వయంగా చెబుతున్నారని అన్నారు. తన అసమర్థతను కలెక్టర్ల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబు సర్కార్‌పై జగన్ ఫైర్

Advertisement

కూటమి పాలనలో గత పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. గురువారం ఉదయం తాడేపల్లిలో పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధులు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మించడాన్ని ఆయన తప్పుబట్టారు.

పీపీపీని వ్యతిరేకిస్తూ కోటి 4 లక్షల మంది సంతకాలు చేశారని అన్నారు. దీనిపై గవర్నర్ ని కలిసేందుకు కేవలం 40 మందికి మాత్రమే పర్మీషన్ ఇచ్చారని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీలతో టీచింగ్ హాస్పటల్స్ వస్తాయని, దానివల్ల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయన్నారు. మా పార్టీ సేకరించిన కోటి 4 లక్షల సంతకాలు న్యాయస్థానం ముందు ఉంచుతామన్నారు.

Advertisement

అధికారంలోకి రాగానే వారందరినీ జైల్లో వేస్తాం-జగన్

దీనిపై అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పకనే చెప్పారు. ఇటీవల పీపీపీ పద్దతి వ్యవహారంపై ఒకానొక సందర్భంలో హైకోర్టు నోరు విప్పింది. దానివల్ల ప్రజలకు మంచి సేవలు అందుతాయని వ్యాఖ్యానించింది.  మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మదరాఫ్ ఆల్ స్కామ్స్ అని వ్యాఖ్యానించారు జగన్.

ఇదే విషయమై బుధవారం సాయంత్రం సజ్జల మీడియాతో మాట్లాడారు. దాదాపు కోటి వరకు సంతకాలు సేకరించామన్నారు.  గురువారం ఉదయం నాటికి కోటి 4 లక్షలని మాజీ సీఎం చెప్పడంపై అధికార పార్టీ నేతలు అప్పుడే రుసరుసలాడుతున్నారు.  వైసీపీ ప్రభుత్వం పోయినా తాము పెట్టిన పథకాలు రద్దు అయ్యాయంటూ ప్రతీ సమావేశంలోనూ చెబుతున్నారు. ఇప్పుడూ అదే చేశారు కూడా.

ALSO READ:  లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్..  ఆమె హిస్టరీ చూసి పోలీసులకు మైండ్ బ్లాక్

సూపర్- 6, 7, అంటూ మోసాలు చేస్తున్నారని విమర్శించారు. పీపీపీ పద్దతిలో చంద్రబాబు సర్కార్ మెడికల్ కాలేజీలు నిర్మించాలని భావిస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. మెడికల్ కాలేజీలు నిర్మించినవారిని రెండు నెలల్లో జైలులో వేస్తామని హెచ్చరించారు.  ఒక విధంగా చెప్పాలంటే కాలేజీలు నిర్మించడానికి ఎవరూ ముందుకు రాకూడదని బెదిరించే ప్రయత్నం చేశారు.

ఉన్నట్లుండి నేతలతో భేటీ కావడం, జగన్ స్పీచ్ ఇవ్వడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.  గురువారం గవర్నర్ వద్దకు వెళ్తున్నారు మాజీ సీఎం. ఈ క్రమంలో పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీ నిర్మాణంపై సేకరించిన కోటి సంతకాల నివేదికను అందజేయనున్నారు. దాన్ని హైలైట్ చేసుకునేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×