E-Paper
Advertisement

VC Sajjanar: కళ్లుండి చూడలేని లోకానికి.. కళ్లతోనే ‘చూపు’నిచ్చింది.. రూప గొప్ప మనసుపై సజ్జనార్ ప్రశంసలు

VC Sajjanar: కళ్లుండి చూడలేని లోకానికి.. కళ్లతోనే ‘చూపు’నిచ్చింది.. రూప గొప్ప మనసుపై సజ్జనార్ ప్రశంసలు
Advertisement

VC Sajjanar: బెంగళూరులో ఇటీవల జరిగిన ఒక విషాద ఘటన మానవత్వాన్ని మించిన గొప్ప పాఠాన్ని నేర్పింది. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేని సమాజంపై పగ పెంచుకోకుండా, అదే సమాజానికి వెలుగును పంచిన ఓ మహిళ ఔదార్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (IPS) స్పందిస్తూ, బాధిత మహిళ రూప గొప్పతనానికి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని బనశంకరి ప్రాంతానికి చెందిన వెంకట రమణన్ (34) ఇటీవల నడిరోడ్డుపై గుండెపోటుతో కుప్పకూలారు. వాహనదారులు, బాటసారులు ఎవరూ సాయం చేయకపోవడంతో, సమయానికి ఆసుపత్రికి చేరక ఆయన మృతి చెందారు. ఆ సమయంలో తన భర్తను కాపాడాలంటూ ఆయన భార్య రూప చేతులెత్తి మొక్కినా ఎవరూ స్పందించలేదు. అయితే, తన భర్త ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ సమాజంపై ఆమె కన్నెర్ర చేయలేదు. “సమాజం నా భర్త ప్రాణాలు కాపాడేందుకు రాలేదు.. కానీ నేను మానవత్వంతో మరో ఇద్దరికి కంటిచూపు ఇవ్వాలని నిర్ణయించుకున్నా” అని రూప తన భర్త కళ్లను దానం చేశారు.

Advertisement

ఈ ఉదంతంపై స్పందించిన సీపీ సజ్జనార్.. “కళ్లుండి కూడా తన బాధను చూడలేని లోకానికి.. తన భర్త కళ్లతోనే ‘చూపు’నిచ్చింది!” అని ప్రశంసించారు. నడిరోడ్డుపై భర్త ప్రాణాల కోసం ఆమె పడ్డ తపనను చూసేందుకు ఈ సమాజానికి కళ్లు చాలలేదని, మనసు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లున్నా గుడ్డిలా ప్రవర్తించిన లోకానికి, తన భర్త కళ్లను దానం చేసి ఆమె మానవత్వపు వెలుగును పంచిందని కొనియాడారు.

సాయం చేయడానికి చేతులు రాని చోట, చూపునిచ్చిన రూపా గారి సంస్కారానికి శిరస్సు వంచి నమస్కరిద్దామని, ఆమె నుంచి సాటి మనిషికి సాయపడటం నేర్చుకుందాం అని సజ్జనార్ పిలుపునిచ్చారు. “Hat’s off to her spirit!” అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Read Also: Telangana Police: మహబూబాబాద్ ఎస్పీకి పాలాభిషేకం.. బాధితురాలి కళ్లలో ఆనందం.. ‘జయహో పోలీస్’ అంటూ నినాదాలు

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×