E-Paper
Advertisement

Andhra News: లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్.. ఆమె హిస్టరీ చూసి పోలీసులకే మైండ్ బ్లాక్!

Andhra News: లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్.. ఆమె హిస్టరీ చూసి పోలీసులకే మైండ్ బ్లాక్!
Advertisement

Andhra News: నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన లేడీ డాన్ అరుణపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. వరుస నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలన్న ఎస్పీ అజిత ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అరుణపై గతంలోనే కోవూరు, నవాబుపేట, వేదాయపాలెం వంటి పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి. ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆమె సాగిస్తున్న అరాచకాలపై పోలీసులు నిఘా ఉంచారు. ముఖ్యంగా రౌడీషీటర్ల కదలికలపై నిశితంగా దృష్టి సారించిన జిల్లా యంత్రాంగం, అరుణను రిపీటెడ్ అఫెండర్‌గా గుర్తించి పీడీ యాక్ట్ అస్త్రాన్ని ప్రయోగించింది.

Advertisement

పీడీ యాక్ట్ ఎప్పుడు విధిస్తారు?
సాధారణంగా రెండేళ్ల కాల వ్యవధిలో ఐదు కంటే ఎక్కువ తీవ్రమైన నేరాలకు పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉంటుంది. సమాజానికి ప్రమాదకరంగా మారిన వ్యక్తులు లేదా బెయిల్‌పై బయటకు వస్తే మళ్లీ నేరాలు చేసే అవకాశం ఉందని భావించినప్పుడు పోలీసులు ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు. అరుణ విషయంలో కూడా ఆమె బయట ఉంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న బలమైన సాక్ష్యాధారాల ఆధారంగానే ఈ చర్య తీసుకున్నారు.

పీడీ యాక్ట్‌తో ఏడాదిపాటు నోబెయిల్..
ఒకసారి పీడీ యాక్ట్ అమలులోకి వస్తే, నిందితులకు బెయిల్ రావడం అత్యంత క్లిష్టంగా మారుతుంది. సాధారణ నేరాల్లో లాగా త్వరగా బయటకు రావడం సాధ్యపడదు. కనీసం ఏడాది పాటు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ బెయిల్ కావాలని భావిస్తే, నిందితులు నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అక్కడ కూడా నేర తీవ్రతను బట్టి న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది తప్ప, సాధారణ బెయిల్ పిటిషన్లు ఇక్కడ పనిచేయవు.

Advertisement

Also Read: ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం

భేటీ కోసం హోంశాఖ ప్రిన్స్‌పల్‌.. సెక్రటరీ అనుమతి తప్పనిసరి
అయితే ఈ చట్టం కింద అరెస్టయిన వారికి జైలులో సందర్శకుల భేటీ సౌకర్యం కూడా చాలా పరిమితంగా ఉంటుంది. సాధారణ ఖైదీల మాదిరిగా ఎవరిని పడితే వారిని కలిసే వీలుండదు. ఎవరైనా కలవాలనుకుంటే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందడం తప్పనిసరి. జిల్లా ఎస్పీ అజిత తీసుకున్న ఈ నిర్ణయం నేర ప్రవృత్తి గల వ్యక్తులకు గట్టి హెచ్చరికగా మారింది. లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేయడం ద్వారా, జిల్లాలో రౌడీయిజానికి తావులేదని పోలీసులు స్పష్టమైన సంకేతాలిచ్చారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×