JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం మళ్లీ వేడెక్కింది. మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఊరంతా చర్చనీయాంశంగా మారాయి. పంచాయతీ ఎన్నికలు, పాత గొడవలు, సొంత ఆదాయం.. ఇలా ప్రతి విషయంపై తనదైన శైలిలో కుండబద్దలు కొట్టారు.
చదువుకున్న వారికే పంచాయతీ పగ్గాలు
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జేసీ కోరారు. చదువుకున్న, విద్యావంతులైన అభ్యర్థులనే గెలిపిస్తేనే ఊళ్లకు నిజమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. చదువున్న వాళ్లకు మాత్రమే గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలుస్తుందన్నది ఆయన మాట.
కక్షలు వద్దు.. కలిసికట్టుగా ఉందాం
గతంలో ఎన్నికలంటేనే ఫ్యాక్షన్ గొడవలు గుర్తొచ్చేవన్నారు. రాళ్లు, బాంబుల ఘర్షణల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని జేసీ గుర్తుచేశారు. ఇప్పుడు అలాంటి రోజులు మళ్లీ రాకూడదన్నారు. వైసీపీ నాయకులు కేతిరెడ్డి పెద్దారెడ్డి మాటలు విని ఎన్నికల్లో పోటీ చేయవద్దని సూచించారు. పోటీపడి కక్షలు పెంచుకుంటే ఇరువర్గాలకూ నష్టమేనని అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని వైసీపీ నేతలను త్వరలోనే కలిసి, అందరం కలిసికట్టుగా ఊళ్లను బాగు చేసుకుందామని పిలుపునిచ్చారు.
నిధుల కోసం ఎదురుచూడొద్దు
ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని ఆశపడే పరిస్థితి లేదని జేసీ స్పష్టం చేశారు. ఊళ్లల్లోనే ఆదాయ వనరులను మనమే సృష్టించుకోవాలన్నారు. ఆ డబ్బుతోనే గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
పెద్దారెడ్డి సవాల్‌కు ఘాటు కౌంటర్
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రతిసారి ‘మొగోడివైతే రా.. కొట్లాడుకుందాం’ అంటూ సవాల్ విసురుతున్నారని జేసీ మండిపడ్డారు. దానికి గట్టి కౌంటర్ ఇస్తూ.. తాను మొగోడిని కాదని గొజ్జా గాడిని.. నువ్వు మొగోడివైతే రారా చూసుకుందాం అంటూ ఘాటుగా స్పందించారు.
Also Read: కలెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. TVK ఎమ్మెల్యేను కాపాడుతున్నారా? విజయ్ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం!