Traffic Management: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేసింది. రహదారి భద్రతను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించింది సర్కార్. దీనికోసం ప్రత్యేకంగా ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు ఏంటీ కొత్త విభాగం?
రాష్ట్రంలో ట్రాఫిక్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, ప్రమాదాలను నివారించేందుకు ‘ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (DTMRS)’ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా రహదారి భద్రతకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఈ ప్రత్యేక డైరెక్టరేట్ పర్యవేక్షించనుంది.
అధికారుల నియామకం ఎలా ఉంటుందంటే..
ఈ కొత్త విభాగం నేరుగా రాష్ట్ర డీజీపీ పరిపాలన, కార్యాచరణ నియంత్రణలో పనిచేయనుంది. దీనికి పూర్తిస్థాయి బాధ్యతలు వహించేలా ఒక ఐజీ స్థాయి అధికారిని డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించనుంది. అలాగే, ఆయనకు సహాయకుడిగా ఒక డీఐజీ స్థాయి అధికారి విధులు నిర్వర్తిస్తారు. ఉన్నతాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ నియంత్రణ మరింత వేగంగా, పకడ్బందీగా జరిగే అవకాశం ఉంది.
ఖజానాపై పైసా భారం లేకుండానే!
సాధారణంగా ప్రభుత్వంలో ఏదైనా కొత్త విభాగం ఏర్పాటు చేస్తే.. కొత్త పోస్టులు, జీతభత్యాల రూపంలో ఖజానాపై భారీగా ఆర్థిక భారం పడుతుంది. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించింది. ఎటువంటి అదనపు ఆర్థిక భారం పడకుండా.. ప్రస్తుతం పోలీస్ శాఖలో అందుబాటులో ఉన్న సిబ్బందితోనే ఈ కొత్త డైరెక్టరేట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటు చేస్తూ జీవో జారీ
డీజీపీ పరిపాలన, కార్యాచరణ నియంత్రణలో పని చేయనున్న నూతన డైరెక్టరేట్
ప్రత్యేక విభాగానికి ఐజీ స్థాయి అధికారి డైరెక్టర్‌గా, డీఐజీ స్థాయి అధికారి… pic.twitter.com/s6Ff5HL14o
— BIG TV Breaking News (@bigtvtelugu) November 24, 2026
Also Read: గరివిడి మండలంలో విషాదం.. వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి