E-Paper
Advertisement

టిడ్కో లబ్ధిదారులు ఒక్క రూపాయి కట్టొద్దు.. చంద్రబాబు పై కొడాలి నాని ఫైర్!

టిడ్కో లబ్ధిదారులు ఒక్క రూపాయి కట్టొద్దు.. చంద్రబాబు పై కొడాలి నాని ఫైర్!
Advertisement

TIDCO Housing: సుమారు 16 వేల మంది పేదలకు సొంత గృహాలు అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొడాలి నాని అన్నారు. టిడ్కో గృహాలు నిర్మిస్తామని ప్రారంభించి, కేవలం 20 శాతం వరకు పనులు పూర్తి చేసి మధ్యలోనే వదిలేసిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు.

అమెరికా నుంచి వచ్చిన గొట్టంగాడు..

గుడివాడలో తప్ప మరెక్కడా టిడ్కో గృహాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కోట్లాది రూపాయలు వెచ్చించి పేదలకు గృహాలు నిర్మించి అందించారని వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి వచ్చిన గొట్టంగాడు రుణమాఫీ చేస్తానంటూ కాలనీ ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్నాడు. రూ.50 వేల కోట్ల రుణాలను మాఫీ చేసే పరిస్థితి ప్రభుత్వానికే ఉంటుందని, ఎమ్మెల్యే ఓట్ల కోసం ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు వచ్చినా, చంద్రబాబు జేజమ్మ వచ్చినా టిడ్కో కాలనీ లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని పిలుపునిచ్చారు.

రుణమాఫీ చేస్తానని హామీ..

Advertisement

సన్నాసి ఎమ్మెల్యేలు చెప్పినట్లు తాను రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వనని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి ప్రజల ముందుకు వస్తానని స్పష్టం చేశారు. టాటా, బిర్లాల స్థాయిలో బిల్డప్ ఇచ్చే ఎమ్మెల్యే ప్రతి పనిలో 30 శాతం వాటా దండుకుంటున్నారని ఆరోపణలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలే ఎమ్మెల్యేకు టాటా, బైబై చెబుతారని, వైసీపీ చైర్మన్ అభ్యర్థి మెరుగుమాల ప్రవీణతో పాటు కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే, బ్యాంకు అధికారుల నుంచి లబ్ధిదారులపై ఒత్తిడి రాకుండా వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

Also Read: గతేడాది 70 వేలు.. ఈసారి 54 లక్షలు! భారత్‌లో మెటా ఇంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఇదే!

Tags

Related News

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ఏపీ సర్కార్ సీరియస్.. రంగంలోకి ఐజీ స్థాయి అధికారి!

గరివిడి మండలంలో విషాదం.. వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

‘నువ్వు మొగోడివైతే రారా చూసుకుందాం’.. పెద్దారెడ్డిపై రెచ్చిపోయిన జేసీ!

‘నువ్వు అసలు ఏ పార్టీ ఎమ్మెల్యేవి?’ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను నిలదీసిన జనసేన కార్యకర్తలు!

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రానున్న నాలుగు రోజులపాటు..

లారీని ఢీ కొట్టిన జీపు.. స్పాట్‌లో ఆరుగురు మృతి, విజయనగరం, పల్నాడు జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు.. ఇక భక్తులకు పండగే, ఆ విధంగా చేస్తే టికెట్ ఈజీ

Big Stories

Advertisement
×