Podarillu Today Episode November 25th:ఇక మహాలక్ష్మి దివ్య కి ఫోన్ చేసి లాప్టాప్ లో అన్నీ ఉన్నాయో లేదని ఒకసారి చెక్ చేసుకుని మళ్లీ లాప్టాప్ ని పక్కన పెట్టేస్తుంది.. ఇక ఆఫీస్ రాగానే లాప్టాప్ ని ఆటోలో పెట్టి ఎక్కడినుంచి దిగిపోతుంది. అయితే ఆఫీసుకు వెళ్లిన తర్వాత దివ్య లాప్టాప్ లో ఉన్నాయా అని అడిగితే ఆ ఉన్నాయి అని అంటుంది అయితే విక్కీ దగ్గరికి వెళ్లి లాప్టాప్ తీసుకొని వస్తాను అని చెప్తుంది అయితే అక్కడ లాప్టాప్ లేకపోవడంతో ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది మహాలక్ష్మి.. లాప్టాప్ ఆటోలో మర్చిపోయాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా శాఖలు ఎప్పుడూ లేనిది విక్కీ కూడా చాలా సీరియస్ అవుతాడు..
ఇక విక్కీ మహాలక్ష్మి దగ్గరికి వచ్చే లాప్టాప్ ఎక్కడ అని అడుగుతాడు. ఇది ఆటలు మర్చిపోయిన అని చెప్పగానే మహాలక్ష్మి పై విక్కీ సీరియల్స్ అవుతాడు వెంటనే ఒక గంట టైం ఇస్తాను నాకు లాప్టాప్ కావాలి ప్రజెంటేషన్ ఇవ్వాలి అని మహా పై విక్కీ సీరియస్ అవుతాడు. ఒక గంటలో నువ్వు లాప్టాప్ తీసుకొచ్చేసి ప్రజెంటేషన్ ఇవ్వాలి అని విక్కీ క్లాస్ పీకుతాడు ఇక మహాలక్ష్మి చక్రిని హెల్ప్ చేయమని అడుగుతుంది. చక్రీ నువ్వేమి టెన్షన్ పడొద్దు నేను చూసుకుంటాను అని అంటాడు. కానీ విక్కీ మాత్రం మహనీని తిడతాడు నువ్వు ఇన్ని రోజులు బెస్ట్ అని అనుకున్నాము. కానీ ఇప్పుడు ప్రశ్నించని ఇవ్వకపోతే క్లైంట్ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఏవి రావు మన ఆఫీస్ గురించి చాలా దారుణంగా మాట్లాడతారు అని వికీ టెన్షన్ పడిపోతూ ఉంటారు కానీ మహాలక్ష్మి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మిని విక్కీ దారుణంగా తిట్టేస్తాడు దాంతో తను చాలా ఫీల్ అయిపోతుంది.. అటు చక్రి మాత్రం మహాలక్ష్మి కోసం రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు.. మహాలక్ష్మి మాత్రం లాప్టాప్ వస్తుందా రాదా అని టెన్షన్ పడుతుంది..
ఎలాగైనా సరే లాప్టాప్ పట్టుకోవాలి అని చక్రి చాలా కష్టపడతాడు. మనము ఎక్కడ వెతికినా కూడా వాడు దొరకడు కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలి అంటే మహాలక్ష్మి ఎక్కడ షాప్ దగ్గర ఎక్కిందో అక్కడ సీసీటీవీ చూస్తే వాడెవరో తెలిసిపోతుంది కదా అనేసి చక్రీ తెలివిగా ఆలోచించి అక్కడికి వెళ్తాడు. అయితే ఆ షాప్ అతన్ని ఎంతగా రిక్వెస్ట్ చేసినా కూడా మొదటి చెప్పను అని అంటాడు కానీ చివరికి చక్రీ బతిమిలాడడంతో అతను ఫొటోస్ చూపించడానికి ఒప్పుకుంటాడు. మొత్తానికి చక్రి ప్లాన్ అయితే బాగా సక్సెస్ అవుతుంది అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని ఆ ఆటో నెంబర్ ఏంటో కనుక్కుంటాడు. ఇక మెల్లగా తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఆటో డీటెయిల్స్ గురించి తెలుసుకుంటారు.. మహాలక్ష్మి కోసం చక్రి మొదటిసారి చాలా కష్టపడి సక్సెస్ అయ్యేలా కనిపిస్తాడని అర్థమవుతుంది.
మహాలక్ష్మి మాత్రం ఆఫీసులో లాప్టాప్ లేకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చాలా భయపడుతూ బాధపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఎప్పుడూ నేను జాగ్రత్తగా ఉంటాను కానీ ఈసారి మాత్రం ఎందుకు తప్పు చేసాను నాకు అర్థం కావడం లేదు అని దివ్యతో చెప్పి చాలా బాధపడిపోతుంది. మనుషులన్నాక పొరపాట్లు చేస్తారు మహా నువ్వు ఇలా బాధపడిపోతే లాప్టాప్ వస్తుందా చక్రి వెళ్ళాడు కదా ఏం జరుగుతుందో చూద్దామని దివ్య అంటుంది. అటు ఎప్పుడు లేనిది విక్కీ మాత్రం చాలా టెన్షన్ పెడుతూ తనని మళ్లీ మళ్లీ అడగడంతో మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది అసలు ఏం చెప్పాలో అర్థం కాక బాధ పడిపోతూ ఉంటుంది. చక్రి ఇంతకీ లాప్టాప్ తెస్తాడా లేదా అని మహాలక్ష్మి కంగారు పడిపోతూ తనకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.
అయితే మహాలక్ష్మి చక్రి కోసం వెయిట్ చేస్తూ ఉండగా చక్రీ లాప్టాప్ తీసుకుని వచ్చి ఇదిగోండి మీ లాప్టాప్ దొరికింది అని ఇస్తాడు. ఆ మాటతో చాలా సంతోషంగా ఫీల్ అయిన మహాలక్ష్మి వెంటనే ప్రజెంటేషన్ ఇవ్వడానికి రూమ్ కి వెళ్తుంది. తను అనుకున్న డ్రీం ప్రాజెక్టు గురించి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి ఇంప్రెస్ చేస్తుంది.మొత్తానికి మహాలక్ష్మి డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం అందరికీ బాగా నచ్చడంతో మహాలక్ష్మి పై ప్రశంసలు కురిపిస్తారు. మొత్తానికి మహాలక్ష్మి అనుకున్న డ్రీం ప్రాజెక్టు అక్కడ వచ్చిన వ్యక్తికి నచ్చడంతో విక్కీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మహాలక్ష్మి వల్ల ఈ ప్రాజెక్టు కూడా విక్కీకి వచ్చింది అని తనని అప్రిషియేట్ చేసి కంగ్రాజులేషన్స్ చెప్తాడు కానీ మహాలక్ష్మి మాత్రం చాలా సీరియస్ గా బయటికి వచ్చేస్తుంది.
ఇక ప్రాజెక్టు ఇంత సక్సెస్ అవ్వడానికే కారణం చక్రీనే అని మహాలక్ష్మి ఎలాగైనా సరే చక్రీని కలిసి థాంక్స్ చెప్పాలని అనుకుంటుంది. ఇక సంతోషాన్ని పట్టలేక మహాలక్ష్మి బయటికి వచ్చి చక్రి కి ఫోన్ చేయగానే నేను ఇక్కడే మీ ఆఫీస్ దగ్గర ఉన్నాను అని చక్రీ చెప్తాడు. అయితే తన ఆనందాన్ని చక్రితో పంచుకోవడానికి వెళ్ళిన మహాలక్ష్మి మళ్ళీ మళ్ళీ థాంక్స్ చెప్తుంది. కానీ ఆ లాప్టాప్ తీసుకురావడానికి చక్రి పడిన కష్టాన్ని విని తనని హాగ్ చేసుకుని మీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు అంటూ అనడంతో చక్రి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. మహాలక్ష్మి నన్ను ప్రేమిస్తుంది అని అనుకుంటాడు. చక్రి ఆ విషయం ఇంట్లో చెప్పి అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను వాయించిన బాలు.. పాపం మీనా.. సుమతి చనిపోతుందా..?