BigTV English

Vizag MLC Election: విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స.. ఖరారు చేసిన జగన్

Vizag MLC Election: విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స.. ఖరారు చేసిన జగన్

Jagan Gave another Chance to Botsa: విశాఖ ఎమ్మెల్సీ సీటుపై కన్నేసింది వైసీపీ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే గెలుపు సునాయాసమవుతుందని భావించింది. ఆయన పేరును అధినేత జగన్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని వైసీపీ వెల్లడించింది.


విశాఖ నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందారు వంశీ కృష్ణయాదవ్. అంతకుముందు ఆయన స్థానిక సంస్థల నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, జనసేనలో చేరిపోయారు. ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉంది. 30న ఎన్నిక జరగనుంది.

శుక్రవారం సాయంత్రం జగన్ బెంగుళూరుకి వెళ్లనున్నారు. రెండువారాల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. ఇవాళ ఉదయం ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో సమావేశమయ్యారు జగన్. ఎమ్మెల్సీ సీటు కోసం ఆ జిల్లాకు చెందిన చాలామంది నేతలు పోటీపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరొకరిని అభ్యర్థిగా ప్రకటిస్తే ఓటమి ఖాయమని భావించిన జగన్.. చివరకు బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు. రకరకాల ప్రలోభాలు, బెదిరింపులతో అడ్డగోలుగా గెలవడానికి అధికార ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. కుయుక్తులు, కుట్రలు అనేవి సీఎం చంద్రబాబు నైజం అని, ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరుగుతోందన్నారు.


Also Read: లక్ష్మీ పార్వతికి బాబు ఇలా ఝలక్ ఇస్తారనుకోలేదు

బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత కావడం ఒకటైతే, ఆ జిల్లాకు చెందిన నేతలతో ఆయనకు సంబంధాలున్నాయి. ఇది తమకు కలిసి వస్తుందని భావించింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బొత్స చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీల ఓట్లు బలాబలాలు పరిశీలిస్తే.. వైసీపీ గెలుపు ఈజీ అవుతుంది. అధికార టీడీపీకి కేవలం 215, వైసీపీకి -615 ఓట్లు ఉన్నాయి. వైసీపీకి ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపితే దాదాపు 841 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మరి అధికార కూటమి తరపున ఎవరు నిలబడతారన్నది ఆసక్తికరంగా మారింది.

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత వైసీపీ నుంచి చాలామంది ఎంపీటీసీ, జడ్పీటీసీలు టీడీపీ, జనసేన గూటికి వెళ్లిపోయారు. ఈ సీటుకు మహా అంటే రెండు లేదా మూడేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం బలమైన వ్యక్తిని పోటీకి దించుతుందా? నార్మల్ వ్యక్తిని దించుతుందా? అనేది వెయిట్ అండ్ సీ.

 

Related News

Amaravati: దక్షిణాదికి శుభవార్త.. అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు, ఎలైన్‌మెంట్‌కు ఆమోదం

AP investments: 53,922 కోట్ల పెట్టుబడులు.. 83,000 ఉద్యోగాలు.. ఏపీలో ఇక పండగే!

Vizag investment: విశాఖకు స్పెషల్ బూస్ట్‌.. ఐటీలో వేరే లెవల్.. భారీ పెట్టుబడి వచ్చేసిందోచ్!

Bapatla news: దివ్యాంగుల ధైర్యం.. బాపట్లలో వినూత్న వివాహం.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే!

AP Govt updates: రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంట కొనుగోలుకు రేటు ఫిక్స్.. మీరు సిద్ధమేనా!

AP family card: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త కార్డు రెడీ.. ఎందుకంటే?

Big Stories

×