 
					Arjun Sarja : ప్రముఖ కన్నడ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న అర్జున్ సర్జ (Arjun Sarja) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. యాక్షన్ కింగ్ గా ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు హీరోగా.. మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో దూసుకుపోతున్న ఇటీవల డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈయన మేనల్లుడు ప్రముఖ హీరో ధ్రువ సర్జా పై కేసు ఫైల్ అయ్యింది. ఈయనతోపాటు ఈయన మేనేజర్, కారు డ్రైవర్ అభిమానులపై కూడా కేసు ఫైల్ అవ్వడం సంచలనంగా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. బెంగళూరులోని బనశంకరి పోలీస్ స్టేషన్లో ధ్రువ సర్జా పై ఆయన పొరుగింటి వారైనా మనోజ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధ్రువ సర్జ అభిమానుల ప్రవర్తనతో విసిగిపోయిన మనోజ్.. “ధ్రువ ఇంటికి వచ్చే అభిమానులు తమ కార్ లను రోడ్డుపై తమ ఇంటి ముందు అడ్డదిడ్డంగా పార్కు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరుస్తూ.. కేకలు వేస్తూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని.. పైగా అభిమానులు తమ ఇంటి ముందు సిగరెట్లు కాల్చుతూ.. గుట్కాలు తింటూ వాటిని గోడలపై ఉమ్మి వేస్తున్నారు. రోడ్లపై ఇంటి ముందు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ విషయం గురించి ధ్రువ సర్జ మేనేజర్ కి డ్రైవర్ కి సమాచారం అందించినా వారు ఎటువంటి చర్య తీసుకోలేదని” ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపోతే మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ (NCR) మాత్రమే నమోదు చేశారు. ధ్రువ సర్జ అతని మేనేజర్, డ్రైవర్ పై ఎఫ్ ఐ ఆర్ కేస్ ఫైల్ చేయాలి అని ఫిర్యాదుదారుడు డిమాండ్ చేసినా.. ఇంకా ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. దీనికి బదులుగా ఎన్సీఆర్ మాత్రమే నమోదు చేసినట్లు తెలుస్తోంది.. ఏది ఏమైనా బాధితుడు ఈ మేరకు కేసు ఫైల్ చేయమని కోరిన పోలీసులు ఎన్సీఆర్ నమోదు చేయడంతో బాధితుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
ALSO READ:Sushanth Singh: సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య.. ఆ ఇద్దరే చేశారంటూ సోదరి కామెంట్స్!
అద్దూరి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన అర్జున్ సర్జ మేనల్లుడు స్వర్గీయ చిరంజీవి సర్జాకు స్వయానా తమ్ముడు. కన్నడలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన ప్రస్తుతం కేడి : ది డెవిల్ అనే చిత్రంలో నటిస్తున్నారు . సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా శిల్పా శెట్టి చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనుంది. ఇందులో శిల్పా శెట్టితో పాటు నోరా ఫతేహి , రవిచంద్రన్ , రమేష్ అరవింద్ తదితరులు నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత విజయ్ సలాస్కర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇందులో సీనియర్ ఇన్స్పెక్టర్ విజయ్ సలార్కర్ అనే పాత్రలో నటిస్తున్నారు.