BigTV English

Rahul Gandhi : అందరూ చూస్తుండగానే చెప్పులు కుట్టిన రాహుల్ గాంధీ..ఎందుకో తెలుసా?

Rahul Gandhi : అందరూ చూస్తుండగానే చెప్పులు కుట్టిన రాహుల్ గాంధీ..ఎందుకో తెలుసా?

Rahul gandhi latest news(Today news paper telugu): రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎంతో హుందాగా పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తున్న తీరు చూసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరపడిపోతున్నారు. క్రమంగా మరుగైపోతున్న కాంగ్రెస్ ను తన దేశవ్యాప్త జోడో యాత్రతో ఊపిరిపోశారు. అధికార పార్టీ నేతల రాజకీయాలను చాకచక్యంతో ఎదుర్కొంటూ వారి వ్యూహాలను తిప్పి కొడుతూ ఈ మధ్యకాలంలో రాటుదేలిపోయారు రాహుల్. మూడో సారి అతి కస్టం మీద ప్రధాని పదవిని పొందిన మోదీ సైతం రాహుల్ లో వచ్చిన రాజకీయ పరిణితి చూసి ఆశ్చర్యపడుతున్నారు. జోడో యాత్ర ప్రభావంతో రాహుల్ సామాన్యుల కష్టాలను తెలుసుకుంటూ తాను కూడా వారి కుటుంబ సభ్యుడిలా ప్రేమగా వారిచ్చిన ఆహారాన్ని తీసుకుని తింటూ, దారిలో బన్నులు తింటూ , చాయ్ తాగుతూ మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మాటల్లోనూ దూకుడు పెంచారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా కేంద్రం చర్యలను ఎండగడుతున్నారు. ఇండియా కూటమి సభ్యులు కూడా ఇప్పుడు రాహుల్ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు.


స్వయంగా చెప్పులు కుట్టిన రాహుల్

ఇటీవల యూపీ సుల్తాన్ పూర్ ప్రాంతానికి విచ్చేసిన రాహుల్ గాంధీ దృష్టిని ఆకర్షించాడు ఓ చెప్పులు కుట్టే వ్యక్తి. ఒక చిన్న దుకాణంలో చెప్పులను సూది దారంతో కుడుతున్న ఆ వ్యక్తి వద్దకు వచ్చి రాహుల్ గాంధీ తనకు కూడా చెప్పులు ఎలా కుట్టాలో నేర్పించాలని అన్నారు. కొద్ది సేపు ఆ వ్యక్తి చెప్పులు కుడుతున్న విధానాన్ని పరిశీలించారు. అతని పేరు రాంచెట్ అని..తన జీవనోపాధి చెప్పులు కుట్టడమేనని చెప్పిన వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ స్వయంగా చెప్పులు కుట్టడాన్ని చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. రాహుల్ నిరాడంబరంగా ఉండటాన్ని చూసి అంతా పొగుడుతున్నారు రాహుల్ ని. అయితే రాహుల్ గాంధీ తర్వాత ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి చెప్పులు కుట్టే ఎలక్ట్రిక్ మిషన్ ను బహుమతిగా పంపించారు.


రూ.పది లక్షలు ఇస్తామన్నా..

రాహుల్ వెళ్లిపోయాక ఆయన కుట్టిన చెప్పులు కొనుగోలు చేయడానికి చాలా మంది పోటీ పడ్డారు. ఒకరైతే ఏకంగా పది లక్షలు ఇస్తానని చెప్పినా సదరు చెప్పులు కుట్టే వ్యక్తి తాను ఎవ్వరికీ ఇవ్వదలుచుకోలేనని తాను రాహుల్ గాంధీ స్వయంగా కుట్టిన పాదరక్షలను ఫ్రేమ్ కట్టించుకుని తన షాపులోనే ఉంచుకుంటానని చెప్పడంతో అందరూ అతని వ్యక్తిత్వానికి ఫిదా అయిపోతున్నారు. అసలు రాహుల్ గాంధీ చెప్పులు కుట్టడమేమిటి, దానిని ఆ పేదవాడు డబ్బులు ఆశించక తన వద్దే చెప్పులు ఉంచుకోవడమేమిటని ఈ సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Related News

Bihar Politics: బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర ర్యాలీ.. మోదీ తల్లిని దూషించిన వ్యక్తి అరెస్ట్

Trump Tariffs: భారత్ బిగ్ స్కెచ్! ట్రంప్‌కు దూలతీరిందా?

Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు..

Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Trump Tariffs Effect: అమెరికా 50% పన్ను ప్రభావం.. 40 దేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తోన్న భారత్

Big Stories

×