Tanveer Ahmed On Aaryavir Sehwag Video Call: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీం ఇండియా నిలిచింది. శనివారం రోజున జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించిన టీమిండియా.. తొమ్మిదవ సారి ఛాంపియన్ గా విజయకేతనం ఎగురవేసింది. అయితే ఈ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ఆర్యవీర్.. తన తండ్రి వీరూతో వీడియో కాల్ మాట్లాడాడు. ఈ విషయాన్ని స్వయంగా వీరేంద్ర సెహ్వాగ్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇద్దరు మాట్లాడుకున్న వీడియోలు కూడా పెట్టాడు.
ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకును కాపాడుకునేందుకు వీరేంద్ర సెహ్వాగ్ ఈ వీడియో కాల్ పేరుతో డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డాడు. పాకిస్తాన్ క్రికెటర్లను బూతులు తిట్టిన భారత క్రికెటర్ల పై కచ్చితంగా బ్యాన్ వేస్తారని… ఈ వీడియో కాల్ తో కొత్త కుట్రలకు వీరేంద్ర సెహ్వాగ్ తెరలేపినట్టు బాంబు పేల్చాడు. పాకిస్తాన్ క్రికెటర్లను తిట్టిన వాళ్లలో తన కొడుకు లేడని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో కాల్ సోషల్ మీడియాలో పంచుకున్నట్టు తన్వీర్ అహ్మద్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
అండర్ 19 ఆసియా కప్ గెలిచిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్, ఆర్యవీర్ వీడియో కాల్ వైరల్ కావడంపై తన్వీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశాడు. పాకిస్తాన్ క్రికెటర్లను తిట్టిన కేసులో ఆర్యవీర్ పై చర్యలు తీసుకునే ప్రమాదం ఉందని.. ఈ తరుణంలోనే వీడియో కాల్ ను కావాలనే సెహ్వాగ్ వైరల్ చేయించాడని బాంబు పేల్చాడు. ఇందులో తండ్రి, కొడుకులు ఇద్దరు పాకిస్తాన్ అభిమానులకు సానుకూలంగా కావాలానే మాట్లాడినట్టు పేర్కొన్నాడు.
బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 2000 మంది పాకిస్తాన్ అభిమానులు సెహ్వాగ్… సెహ్వాగ్ అంటూ తనను ప్రోత్సహించాడని తండ్రికి ఆర్యవీర్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని మండిపడ్డాడు. వీరేంద్ర సెహ్వాగ్ క కుటుంబానికి పాకిస్తాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పే ప్రయత్నంలో భాగంగా తండ్రి, కొడుకులు ఈ వీడియో కాల్ పేరుతో డ్రామాలు ఆడినట్టు ఆగ్రహించాడు. ఇలా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయితే… పాకిస్తాన్ క్రికెటర్లను తిట్టిన సంఘటనలో ఆర్యవీరు సేఫ్ గా బయటపడతాడని వీరూ కావాలనే తన సోషల్ మీడియాలో వీడియోలు పెట్టినట్టు తెలిపాడు. అంతే తప్ప పాకిస్తాన్ అంటే వీరేంద్ర సెహ్వాగ్ కు ( Virender Sehwag) ఎలాంటి అభిమానం లేదని వెల్లడించాడు. తమ దేశాన్ని ఎప్పుడు శత్రువుగానే అతడు భావిస్తాడని వెల్లడించాడు.