Chennai: రాజకీయ నేతలు అందివచ్చిన అవకాశాలను ఏ మాత్రం వదులుకోరు. ఏదో విధంగా పావులు కదుపుతూనే ఉంటారు. తాము అనుకున్నది సాధించుకోవాలని భావిస్తారు. వైసీపీ అధినేత జగన్ కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ అసలు మేంటరేంటి? అనుకుంటున్నారా? అక్కడికి వచ్చేద్దాం.
గురువారం తాడేపల్లిలో మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం జగన్.. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌పై చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పారు. ఎప్పటి మాదిరిగా సొంత గెజిట్‌లో వచ్చిన విషయాలను బయటపెట్టారు. ఆ గెజిట్ చదవలేని వారికి ఇదొక బంపరాఫర్. మీడియా మిత్రులు పలు రైజ్ చేస్తున్న సమయంలో టైమ్ లేదంటూ తప్పించుకునిపోయారు. విజయవాడ నుంచి నేరుగా చెన్నైకి వెళ్లారు.
వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అంతేకాదు ఇండియా టాప్ బిజినెస్‌మేన్ అదానీ కూడా హాజరయ్యారు. అదానీని చూడగానే చాలామంది షాకయ్యారు. దేశంలో చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారని, కేవలం గౌతమ్ అదానీ హాజరుకావడం వెనుక అసలు మేటరేంటి? ఏం జరిగింది? అంటూ అప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు పెట్టేసుకున్నారు ఏపీ-తెలంగాణ నేతలు.
ఓ వైపు వివాహ వేడుక జరుగుతుండగానే మరోవైపు పారిశ్రామిక వేత్త అదానీతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయినట్టు ఆ పెళ్లికి వెళ్లిన కొందరు వ్యక్తులు చెబుతున్నారు. వారిద్దరు మధ్య ఏం జరిగిందనే టాప్ సీక్రెట్. అలాంటి విషయాలు బయటకు రావు. కాకపోతే అక్కడకు వెళ్లిన వారి వెర్షన్ మరోలా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తనపై కేసుల జోరు అందుకోకుండా ఉండేందుకు స్కెచ్ వేసినట్టు చెబుతున్నారు.
ALSO READ: కర్నూలు జిల్లాలో జడ్పీటీసీ ఎన్నిక రద్దు.. మళ్లీ రీపోలింగ్?
ఈ క్రమంలో మూడో కంటికి తెలియకుండా జగన్ పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాక్రోచ్ పార్టీ వైపు జగన్ మొగ్గు చూపారు. ఈ విషయం తెలిసి జగన్‌పై కేంద్రం పెద్దలు కాస్త అగ్గి మీద గుగ్గిలం అయినట్టు టాక్. ఎప్పుడూ లేని విధంగా జగన్ కేసుల్లో కదలిక వచ్చిందని అంటున్నారు. కేసుల వేడి తగ్గించుకునేందుకు అదానీ ద్వారా మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌పై కేసుల జోరు తగ్గితే పెళ్లి వేడుకలో జరిగిన మంత్రాంగం ఫలించినట్టేనని అంటున్నారు. ఈ విషయం తెలియగానే కొద్దిరోజుల్లో చూడాల్సిందేనని అంటున్నారు.
ఒకే వేదికపై వైఎస్ జగన్, సీఎం విజయ్, కేటీఆర్
చెన్నైలో జరిగిన వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు పలువురు అగ్ర రాజకీయ నాయకులు హాజరయ్యారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.… pic.twitter.com/5NsjiGSiVS
— BIG TV Breaking News (@bigtvtelugu) November 5, 2026
CM Vijay, Trisha, KTR, Jagan, Adani in one Frame.
BRS Working President KT Rama Rao (KTR), along with his wife Shailima, Tamilnadu CM Vijay and actor Trisha, YSRCP chief YS Jagan Mohan Reddy, Adani Group Chairperson Gautam Adani… attended the wedding ceremony of YS Anil’s… pic.twitter.com/YOmLUBP2my
— Surya Reddy (@jsuryareddy) November 5, 2026