E-Paper
Advertisement

ఇవి ఎలక్షన్స్ ఆ..? లేక సెలక్షన్స్ ఆ.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్!

ఇవి ఎలక్షన్స్ ఆ..? లేక సెలక్షన్స్ ఆ.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్!
Advertisement

Election Irregularities: దేశ చరిత్రలో ఇలాంటి ఘోరమైన ఎన్నికలు ఎక్కడ జరిగి ఉండవు అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జటన్ అన్నారు. ఎన్నికల పక్రియను కబ్జా చేసి ఎన్నికలు జరిపారుని అన్నారు. ఎన్నికల వ్యవస్థను హైజాక్ చేసి పక్రియ జరిపారు. ఎన్నికల పక్రియలో చంద్రబాబు శకుని పాత్ర పోషించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం, రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేసారని ఫైర్ అయ్యారు. అసలు ఇవి ఎలక్షన్స్ ఆ…? సెలక్షన్స్ ఆ…? ఇంతలా దుర్మార్గాలు చేసి ఎన్నికలు జరపడం దేనికి..? ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు కనుకే ఫెయిర్ ఎన్నికలు వెళ్లే దమ్ము ధైర్యం లేదని గాటు వ్యాఖ్యలు చేశారు.

ఇద్దరూ కుమ్మకయ్యారు..?

స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే చంద్రబాబు దిమ్మతిరగడం ఖాయం అని ఆయనకి తెలుసు.. కాబట్టే ఈ ఎన్నికల్లో పోలీసు వ్యవస్థ దారుణంగా దిగజారిపోయిందని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గూండాలతో పోలీసులు కుమ్మక్కు అవ్వడం సిగ్గుచేటు అని, అందరూ మాఫియా ముఠాలా ఏర్పడి ఎన్నికల వ్యవస్థను గుప్పెట్లోకి తీసుకున్నారని అన్నారు sec చంద్రబాబు తొత్తుగా మారి ఎన్నికలు జరిపారని అన్నారు. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఈ ఎన్నికల చూస్తే ఎవరికైనా అనిపిస్తుందని జగన్ అన్నారు. దేశంలో ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీల నామినేషన్ వెయ్యకుండా అడ్డుకోవడం చూసామా..? పోటీ లేనప్పుడు ఎలక్షన్ ఎలా అవుతుంది..? సెలక్షన్ మాత్రమే అవుతుందని అన్నారు.

సుప్రీం కోర్టు చివాట్లు..

Advertisement

సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా వీళ్ళకి బుద్ధిరాలేదని ఫైర్ అయ్యారు. ధైర్యం చేసి నామినేషన్ వేస్తే కావాలని రిజెక్ట్ చెయ్యడం ఏంటి..? పోలింగ్ అర్జెంటులు లేకుండా స్వేచ్ఛా రిగ్గింగ్ చేసేసుకున్నారు. 84 zptc స్థానాలు నామినేషన్ వెయ్యకుండా అడ్డుకున్నారని జగన్ అన్నారు. 2109 mptc స్థానాల్లో పోటీ లేకుండా నామినేషన్ వెయ్యనివ్వలేదు. సుప్రీం కోర్టు ఆదేశాలను బేకాతరు చేశారని అన్నారు. పోలింగ్ రిగ్గింగ్, బ్యాలెట్ బాక్స్ లు రిగ్గింగ్, చివరికి పలితాలు రిగ్గింగ్ అని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also read: ఐశ్వర్య అర్జున్ ఉమాపతి విడాకుల వార్తలు..తంబి రామయ్య రియాక్షన్ ఇదే!

Tags

Related News

కొత్తపట్నం తీరానికి కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం.. స్పందించిన మంత్రి డోలా!

తిరుమల లడ్డూ కల్తీ కేసు అంశం.. నో చెప్పిన సుప్రీంకోర్టు, ఇంతకీ ఆ పిటిషన్ ఏంటి?

పులివెందులలో సేమ్ సీన్ రిపీట్.. టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. టపాకాయలు, రాళ్లతో దాడులు

ఎన్నికల పోలింగ్ వేళ చంద్రగిరిలో ఊహించని సీన్.. ఇది మామూలు ర్యాగింగ్ కాదు, ఏకంగా చెవిరెడ్డికే

ఏపీలో డీఎస్సీ-2026 నోటిఫికేషన్ రిలీజ్.. 2721 పోస్టులు భర్తీ, నవంబర్ 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఏపీలో ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు, భారీగా బలగాలు మోహరింపు

ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ వాయిదా!

Big Stories

Advertisement
×