E-Paper
Advertisement

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నేపాల్ ఏజెంట్ దారుణం.. ఏం చేసాడంటే..?

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నేపాల్ ఏజెంట్ దారుణం.. ఏం చేసాడంటే..?
Advertisement

Russia War: కన్నకొడుకు ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో తెలియని పరిస్థితి.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న భయం.. ఇదీ రష్యాలో చిక్కుకున్న యువకుడి తల్లి అప్పలకొండ ఆవేదన. ఉపాధి కోసం తన కొడుకు రష్యా వెళ్లాడు. అయితే అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన నేపాల్‌కు చెందిన ఓ ఏజెంట్ చేతిలో మోసపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరో ముగ్గురితో కలిసి మొత్తం నలుగురిని ఉద్యోగాల పేరుతో తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఆవేదన వ్యక్తం..

మొదట్లో ప్రతి 15 రోజులకు ఒకసారి కొడుకు ఫోన్ చేసి మాట్లాడేవాడని అప్పలకొండ చెబుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చివరిసారిగా ఆదివారం వీడియోతో పాటు ఫోన్‌లో మెసేజ్ వచ్చిందని.. ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు రష్యాలో యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకుపోయాడని.. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడేసి ఇంటికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే స్థానిక పోలీసులకు, ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

ఉద్యోగం కోసం..

Advertisement

ఓవరాల్ గా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన కొడుకు.. యుద్ధంలో చిక్కుకోవడంతో ఆ తల్లి పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని తన కొడుకును స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటోంది.

Also Read: వియత్నాంలో కావ్య కళ్యాణ్ రామ్ బ్యాచిలర్ పార్టీ.. ఫోటోలు వైరల్!

Tags

Related News

లక్షల రూపాయల ప్రజాధనం వృదా అయినట్టేనా.. పరకాల మార్కెట్ యార్డ్‌లో దారున సమస్య!

సీఐ సుబ్బనాయుడు సాహసోపేతమైన చర్య.. హోంమంత్రి అనిత ప్రశంసల వర్షం!

ఇవి ఎలక్షన్స్ ఆ..? లేక సెలక్షన్స్ ఆ.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్!

కొత్తపట్నం తీరానికి కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం.. స్పందించిన మంత్రి డోలా!

తిరుమల లడ్డూ కల్తీ కేసు అంశం.. నో చెప్పిన సుప్రీంకోర్టు, ఇంతకీ ఆ పిటిషన్ ఏంటి?

పులివెందులలో సేమ్ సీన్ రిపీట్.. టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. టపాకాయలు, రాళ్లతో దాడులు

ఎన్నికల పోలింగ్ వేళ చంద్రగిరిలో ఊహించని సీన్.. ఇది మామూలు ర్యాగింగ్ కాదు, ఏకంగా చెవిరెడ్డికే

Big Stories

Advertisement
×