Police Rescue: గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని తిమ్మాపురం అండర్‌పాస్ వద్ద వరదలో చిక్కుకున్న మహిళలను పోలీసులు కాపాడారు. మొత్తం ముగ్గురు మహిళలు వరద ప్రవాహంలో చిక్కుకున్నట్లు సమాచారం అందుకున్న సీఐ సుబ్బనాయుడు వెంటనే అక్కడి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం వారిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి మహిళలను చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బనాయుడు కాపాడారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిది.
సీఐ నడుముకు తాడు కట్టుకుని ఉధృత వరదలోకి దూకిన సీఐ.. సిబ్బంది సహకారంతో ముగ్గురు మహిళలను సురక్షితంగా పోలీసులు ఒడ్డుకు చేర్చారు. దీంతో పోలీసుల సాహసోపేత చర్యపై హోంమంత్రి అనిత ప్రశంసలు కురిపించారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మహిళలను కాపాడిన పోలీసులకు అభినందనలు అని అన్నారు. పోలీసుల ధైర్యసాహసాలు సమాజానికి స్ఫూర్తిదాయకం హోంమంత్రి అనిత అన్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడటమే పరమ కర్తవ్యంగా భావించి, ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది సేవలు అభినందనీయం. చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు వాగు ఉధృతిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు స్వయంగా తాడు కట్టుకుని నీటిలోకి దిగి సాహసోపేతంగా రక్షించడం ఎంతో ప్రశంసనీయం అని.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన ఆయన ధైర్యసాహసాలకు హృదయపూర్వక అభినందనలుఅని, ప్రజా రక్షణలో నిబద్ధతతో పనిచేస్తున్న ప్రతి పోలీసు సిబ్బందికి నా సెల్యూట్ అంటూ హో మంత్రి అనిత సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు.
ప్రజల ప్రాణాలను కాపాడటమే పరమ కర్తవ్యంగా భావించి, ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది సేవలు అభినందనీయం.
చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు గారు వాగు ఉధృతిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు స్వయంగా తాడు కట్టుకుని నీటిలోకి దిగి సాహసోపేతంగా రక్షించడం ఎంతో ప్రశంసనీయం.… pic.twitter.com/bMSXHnBnCF
— Anitha Vangalapudi (@Anitha_TDP) November 5, 2026
Also Read: చలికాలంలో ఫోన్ ఛార్జింగ్ నెమ్మదిగా అవుతోందా? అసలు కారణం ఇదే!