Shani effect to Jagan: వైసీపీ అధినేత జగన్‌కు కష్టాలు రెట్టింపు అయ్యాయా? అన్నీ ఒక్కసారే వచ్చిపడ్డాయా? వాటిని ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతున్నారా? ఆల్రెడీ ఫ్యామిలీ అంతర్గత కలహాలు మొదలయ్యాయా? మరో పుష్కరకాలం కష్టాలు తప్పవా? నిన్న ముంబై నటి వ్యవహారం.. నేడు తిరుమల లడ్డూ? రేపు ఇంకే వ్యవహారమంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు పార్టీ నుంచి నమ్ముకున్న నేతలు బయటకు వెళ్లిపోవడం, మరోవైపు ఫ్యామిలీ కష్టాలు, ఇంకోవైపు ముంబై నటి వ్యవహారం, ఇప్పుడు తిరుమల లడ్డూ వంతైంది. వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ప్రస్తుతం జగన్‌కు శని వెంటాడుతోందంటూ ఓ ఫీలర్ బయటకు వచ్చింది. 12 ఏళ్లపాటు ఈ కష్టాలు తప్పవన్నది అందులోని సారాంశం. ఈ ఏడాది జనవరిలో శని ఎంటరైందట.
శని ప్రభావం గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. శని నుంచి తప్పించుకోవడం ఎవరివల్ల కాదని, ఈశ్వరుడు సైతం ఇబ్బందులు పడ్డారని పురాణాలు చెబుతున్నమాట. ఇప్పుడు జగన్ పరిస్థితి దాదాపుగా అంతే. బెడవాడ వరదల విషయంలో జగన్ పీకల్లోతులో మునిగిపోయారు. దాని నుంచి బయటపడేందుకు నానాప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పార్టీకి ఊహించని తొలి దెబ్బ.
రెండోది ముంబై నటి కాదంబరి జత్వానీ ఇష్యూ. ఇందులో అధికారులు నిండా మునిగిపోయారు. ఐపీఎస్‌లు చేసిన పనిని అందరూ ఛీదరించుకుంటున్నారు. పార్టీని మరింత డ్యామేజ్ చేసిందని వైసీపీలోని ఓ వర్గం బలంగా నమ్ముతోంది. అధికారులు నోరు విప్పితే పార్టీ జెండా పీకేయడం ఖాయమన్నది నేతల అంతర్గత సంభాషణ.
ALSO READ: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ
తాజాగా తిరుమల లడ్డూ వ్యవహారం. గురువారం దేశవ్యాప్తంగా మీడియా ఛానెళ్లలో ఒకటే చర్చ. ఏ ఛానెల్ తిప్పినా తిరుమల లడ్డూ వ్యవహారం, రిపోర్టులు. చివరకు సోషల్‌మీడియా సైతం జగన్‌ను ఏకి పారేసింది. దీన్ని డిఫెండ్ చేయలేక వైసీపీ విభాగం చేతులెత్తేసింది. చివరకు మోదీ కేబినెట్‌లోని హిందుత్వ వాదులు సైతం దీన్ని తూర్పారబట్టారు.
బీజేపీలోని కీలక పెద్దల వద్ద జగన్‌కున్న ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. శని ప్రభావం గురించి ముందుగానే తెలుసుకున్న జగన్‌బాబు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగుళూరుకు షిప్ట్ కావడానికి ఇదే కారణమని అంటున్నారు. ఇక జగన్ అధికారంలో ఉన్నప్పుడు డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు పత్తా లేకుండా పోయారు.
మరో విషయం ఏంటంటే జగన్ ఫ్యామిలీలో అంతర్గత కలహాలు ముదిరి పాకాన పడినట్టు తెలుస్తోంది. ఓ వైపు వివేకా కేసు, మరోవైపు నటి వ్యవహారం పరిణామాలతో అంతర్గత విభేదాలు మొదలైనట్టు కడపలో ఓ వార్త షికారు చేస్తోంది. కొద్దిరోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని కొందరు పండితులు సూచన చేశారట.
వరదల విషయంలో అధికార పార్టీపై బురద జల్లాలని ప్రయత్నించి దొరికిపోయారు జగన్. ఆ తరహా ఇబ్బందులు మరో నాలుగైదు ఏళ్లు తప్పవని, ఆ తర్వాత కుదుట పడుతుందని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనంలో జగన్ అనే కన్నా.. ప్యాలెస్‌లో అధినేత అనడమే బెటరని అంటున్నారు.