BigTV English
Advertisement

OTT : ఓటిటిలోకి డెడ్ పూల్ & వుల్వరైన్… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?

OTT : ఓటిటిలోకి డెడ్ పూల్ & వుల్వరైన్… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?

OTT : హాలీవుడ్ సినిమాలకు ఓటీటీలోనే కాదు థియేటర్లలో కూడా దుమ్మురేపే రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అందులోనూ మార్వెల్ నుంచి రిలీజ్ అయ్యే సినిమాలు రిలీజ్ అయితే రికార్డులు తిరగరాయడం ఖాయం. ఇలా మార్వెల్ నుంచి రిలీజైన తాజా సూపర్ హీరో మూవీ ‘డెడ్‌పూల్ & వుల్వరైన్’ సినిమా కూడా చరిత్రను సృష్టించింది, ఇది ఎప్పటిలాగే ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు దక్కించుకున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద $1.3 బిలియన్ల వసూళ్లను కొల్లగొట్టిన ఈ చిత్రం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ మూవీ లవర్స్ ను అలరించింది. కానీ ఈ మూవీని ఎప్పుడెప్పుడు ఇంట్లోనే కూర్చుని చూద్దామా అని ఓటీటీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే మేకర్స్ ఈ చిత్రం ఓటీటీ ప్రీమియర్‌కు సంబంధించిన ఒక పెద్ద అప్‌డేట్ ను ఇచ్చారు. ఓటీటీలో ‘డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్’ ఎప్పుడు, ఎక్కడ ప్రసారం అవుతుందో తెలుసుకుందాం పదండి.


ఓటీటీలో ‘డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్’ మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు ?

‘డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్’ విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రివ్యూలను అందుకుంది. దీంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. సమాచారం ప్రకారం ఈ చిత్రం ఒక్క భారతదేశంలోనే ఏకంగా 100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. రీసెంట్ గా బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది. షాన్ లెవీ దర్శకత్వం వహించిన డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మన్ హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో ఇద్దరూ డెడ్‌పూల్, వుల్వరైన్ పాత్రలను పోషించారు. ఎమ్మా కొరిన్, మాథ్యూ మక్‌ఫాడియన్, జోన్ ఫావ్‌రూ, మోరెనా బాకరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నిర్మాతలు కెవిన్ ఫీగే, లారెన్ షులర్ డోనర్, ర్యాన్ రేనాల్డ్స్ అండ్ షాన్ లెవీ.


Download wallpaper 1280x720 marvel's movie, deadpool and wolverine, hd, hdv, 720p widescreen wallpaper, 1280x720 hd background, 30779

మీడియా నివేదికల ప్రకారం ఈ చిత్రం 2024 అక్టోబర్ 1 నుండి ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (PVOD)లో ఇంగ్షీషులో అందుబాటులో ఉంటుంది. డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్ లో దీని స్ట్రీమింగ్ అక్టోబర్ చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, ఇతర భారతీయ భాషల్లో ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు? అనే విషయాన్ని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.

భారతదేశంలో ‘డెడ్‌పూల్ మరియు వుల్వరైన్’ ఎంత సంపాదించింది?
భారతదేశంలో కూడా “డెడ్‌పూల్ మరియు వుల్వరైన్” అద్భుతంగా ఆడింది. ఈ చిత్రం ఇండియాలోని అన్నీ భాషల్లో కలిపి రూ. 135.22 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1.3 బిలియన్ డాలర్లు వసూలు చేసి అద్భుతాన్ని క్రియేట్ చేసింది. సినిమాలోని రెండు ప్రధాన పాత్రలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కింది. మొత్తానికి డెడ్ పూల్ & వుల్వరైన్ ఇద్దరూ కలిసి బాక్స్ ఆఫీసును షేక్ చేశారు. అయితే ఈ మూవీని ఓటీటీలో చూడాలంటే మాత్రం అక్టోబర్ దాకా ఆగాల్సిందే.

Related News

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : భార్య చనిపోవడంతో మరో అమ్మాయితో… దెయ్యం పాపతో ఆ పనులేంటి భయ్యా ?

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Big Stories

×