Amaravati News: వైసీపీ హయాంలో రైతులు ఓ వెలుగు వెలిగారా? రైతుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? వారిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదా? తుఫానుకు ముందు, ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.
పులివెందుల మాటలను రిపీట్ చేసిన జగన్
గురువారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులను కనీసం పట్టించుకోలేదన్నారు. రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నారు. 60 శాతం జనాభా.. వ్యవసాయంపై ఆధారపడుతున్నా.. రైతులు సంతోషంగా లేరన్నారు.
మా హయాంలో పండగలా ఉన్న వ్యవసాయం, ఇప్పుడు దండగలా మారిందన్నారు. వైసీపీ ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు కూడా. రీసెంట్‌గా పులివెందుల నియోజకవర్గంలో జగన్ పర్యటించారు. అప్పుడు మీడియా ముందు చెప్పిన మాటలనే ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు గ్లోబెల్స్‌కు టీచర్
సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే విధంగా పాలన ఉందన్నారు మాజీ సీఎం. మొంథా తుఫానుపై ఆర్టీజీఎస్ అంటూ హడావుడి చేశారని, నష్టపోయిన రైతులకు సాయం చేయలేదు. 19 నెలల్లో 17 సార్లు ప్రకృతి విపత్తులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. రైతులు హక్కుగా ఉన్నపంటల భీమా పథకం రద్దు చేశారని అన్నారు.
దిత్వా తుఫాను వస్తుందని 10 రోజుల ముందే తెలుసని, తుఫాను కంటే ముందు పంటలు ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. కనీసం రైతులను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని అన్నారు. కేజీ అరటిపండ్లు అర్ధరూపాయంటే రైతులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో అరటి, చీని రైతుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపామన్నారు.
ఏపీ నుంచి ఢిల్లీ, ముంబైకి రైళ్లలో మూడు లక్షల టన్నులు ఎగుమతి చేశామన్నారు. రైతులకు నష్టం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కరెంట్ బిల్లులు కట్టాల్సి వస్తుందని, కోల్డ్ స్టోరేజీలు బంద్ చేశారని వ్యాఖ్యానించారు. ఆర్‌బీకేలు, ఈ-క్రాప్ వ్యవస్థలు కనుమరుగైపోయాయని విమర్శించారు. సూపర్ సిక్స్ హమీలు అమలు చేశామంటూ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.
ALSO READ: ఏపీకి మంత్రి వెంకట్‌రెడ్డి కోమటిరెడ్డి, సీఎం చంద్రబాబుతో భేటీ
అబద్దాల ప్రచారంలో గోబెల్స్‌ని మించిపోయారని, వారికి టీచర్‌గా ఆయన మారారన్నారు. నిరుద్యోగ భృతి కింద మూడు వేలు ఎక్కడ ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. రెండేళ్లలో నిరుద్యోగులకు 72 వేలు ఇవ్వాలని, ఎవరికి ఇచ్చారని ఆరోపించారు. 18 ఏళ్ల నిండిన ప్రతీ ఒక్కరికి నెలకు రూ. 1500, 50 ఏళ్లకు పెన్షన్ అని చెప్పారని, ఎవరికైనా ఇచ్చారా అంటూ ప్రశ్నల ప్రశ్నలు సంధించారు.
అన్నదాత సుఖీభవలో పది వేలు ఇచ్చి, 30 వేలు ఎగొట్టారని ఆరోపించారు. తల్లికి వందనం కింద 20 లక్షలు మంది విద్యార్థులను తగ్గించారని దుమ్మెత్తిపోశారు. హామీలు ఇచ్చి మోసం చేసినవారిపై చీటింగ్ కేసు పెట్టాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టల్‌లో ఆహారం ఏ మాత్రం బాగోలేదన్నారు.
కలుషిత ఆహారంతో 29 మంది విద్యార్థులు చనిపోయారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా జరిగిందన్నారు. కలుషిత నీరు కారణంగా వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని చెప్పుకొచ్చారు. పిన్నెల్లి సోదరులపై ఏకంగా 16 కేసులు కూటిమి ప్రభుత్వం నమోదు చేశారని గుర్తు చేశారు. ఇలా అక్రమ కేసులు పెడితే నక్సలైట్లు పుడతారని వ్యాఖ్యానించారు మాజీ సీఎం జగన్.
మా హయాంలో పండుగలా ఉన్న వ్యవసాయం ఇప్పుడు దండగలా మారింది. మొన్న ఈ మధ్య మొంథా తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు బృందం బిల్డప్ మాత్రం మాములుగా లేదు. ఆయన, ఆయన కొడుకు, దత్తపుత్రుడు ఏ రకంగా బిల్డప్ ఇచ్చారో చూసాం
– మాజీ సీఎం వైఎస్ జగన్ pic.twitter.com/XYx5zTkvHK
— BIG TV Breaking News (@bigtvtelugu) December 4, 2025