Jagan Comments on CM Chandrababu: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వరదల వల్ల 6 లక్షల మంది ప్రభావితమయ్యారు. విజయవాడలో ఏ కాలనీ తీసుకున్నా ఇదే పరిస్థితి. చంద్రబాబు బాధితులను ఆదుకునేందుకు ఏం చేయట్లేదు.
ఎక్కడా కూడా రిలీఫ్ క్యాంపులు లేవు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఉంటే బాధితులను రిలీఫ్ క్యాంపులకు తరలించేవారు.
Also Read: తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం భారీ విరాళం.. ఏపీ పంచాయతీలకు మరో రూ. 4 కోట్లు ?
ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదికాదు. తప్పు చంద్రబాబు దగ్గరే జరిగింది. బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటరీ ఉంటుంది, ఆ గేట్లు ఎవరు.. ఎందుకు ఎత్తారు? గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు ఇల్లు మునిగి ఉండేది. గేట్లు ఎత్తితే వరద నీరు విజయవాడకే వస్తాయి. ప్రభుత్వం తప్పిదం వల్లే ఈ ఘటన జరిగింది. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ వల్ల జరిగిన ఘటన ఇది.
Also Read: బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చలేకపోయాం: సీఎం చంద్రబాబు
తుపాన్ రాబోతుందనే విషయం చంద్రబాబుకు తెలియదా? తుపాన్ ఉందని బుధవారమే హెచ్చరికలు వచ్చాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు. వాతావరణ శాఖ అలర్ట్ గా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి ఉండేదికాదు. 32 మంది ప్రాణాలను కోల్పోయారు.. ఇంతమందికి చావుకు చంద్రబాబుదే బాధ్యత. ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ప్రతి కుటుంబానికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ప్రతి ఇంటికి రూ. 50 వేలు ఇవ్వాలి’ అంటూ జగన్ పేర్కొన్నారు.
అయితే రెండురోజుల క్రితం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్.. బుడమేరు గేట్లను చంద్రబాబు ఇల్లు మునగకుండా ఉండేందుకే ఎత్తారని ఇదే పాట పాడారు. పైగా.. రిటైనింగ్ వాల్ కట్టిన ఘనత తమదేనని చెప్పుకోగా.. ఆ వ్యాఖ్యలపై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. 70 శాతం రిటైనింగ్ వాల్ కట్టడం టీడీపీ హయాంలోనే కట్టగా.. మిగతాది వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిందని, అంతమాత్రానికి మొత్తం క్రెడిట్ అంతా మీరే ఎలా తీసుకుంటారని ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి వరద బురద రాజకీయాలు చేయడం తగదని సీఎం చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు.