Akkineni Nagarjuna: రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఏపీని వరదలు ముంచెత్తాయి. విజయవాడ చుట్టూ పక్కల ప్రాంతాళ్లు అల్లకల్లోలం గా మారాయి. ఇక ఈ వరదల వలన ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. ఇక వరద బాధితులకు సినీ ఇండస్ట్రీ సహాయంగా నిలబడింది. వారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చింది.
స్టార్ హీరోలు సైతం తాము ఉన్నామని ముందుకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ ఇలా టాలీవుడ్ హీరోలందరూ తమ స్తోమతకు తగ్గ విరాళాలను రెండు తెలుగు రాష్ట్రాలకు అందిస్తున్నారు.
ఇకపోతే సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మాత్రం ఒక్క రూపాయి ఇవ్వకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలకు, నాగ్ కు మధ్య డైరెక్ట్ గానో, ఇన్ డైరెక్ట్ గానో వైరం ఉంది. ఈ మధ్యనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. నాగ్ కు సంబంధించిన N కన్వెన్షన్ ను కూల్చివేసిన విషయం తెల్సిందే . దీంతో నాగ్ .. తెలంగాణ ప్రభుత్వంపై కోపం గా ఉన్నాడు.
ఇక ఏపీలో మొన్నటివరకు నాగ్.. జగన్ కు సపోర్ట్ గా నిలబడ్డాడు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం లేదు. దీంతో ఏపీ సైడ్ కూడా నాగ్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కామెంట్స్ వచ్చాయి. ఇక ఇలాంటి సమయంలో నాగార్జున మానవత్వం చూపించాడు. అలాంటి విషయాలను ఏమి పట్టించుకోకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు తనవంతు సాయం అందించాడు.
విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ తరుపున వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు.
“ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాము. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం” అని వారు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ఇక దీంతో నాగార్జునను అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక ఈ విషయాన్నీ నాగ్ సైతం ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
“ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా అక్కినేని కుటుంబసభ్యులుగా మేము ఒక్కొక్కరుగా 50 లక్షల రూపాయలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందించాలనుకుంటున్నాము. వేగవంతమైన సహాయక చర్యలను అందించడంలో మరియు రికవరీకి సహాయం చేయడంలో ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి మేము ఐక్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సవాలును స్థైర్యంతో ఎదుర్కొందాం మరియు బలంగా ఉద్భవిద్దాం” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ప్రస్తుతం నాగార్జున ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క బిగ్ బాస్ తో బిజీగా మారాడు. హీరోగానే కాకుండా కీలక పాత్రల్లో నటించడం మొదలుపెట్టాడు. కుబేర, కూలీ సినిమాల్లో నాగ్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నాడు. మరి ఈ సినిమాలతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
In response to the severe flooding in both the Telugu states, we as Akkineni family wish to contribute 50 lakhs each to the CM Relief Funds for Andhra Pradesh and Telangana.
It’s crucial that we unite to support the government’s efforts in delivering swift relief measures and…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 4, 2024