BigTV English

Jagan’s Delhi Maha dharna: హస్తినలో జగన్ మహాధర్నా, ముందే షాకిచ్చిన కేంద్రం..

Jagan’s Delhi Maha dharna: హస్తినలో జగన్ మహాధర్నా, ముందే షాకిచ్చిన కేంద్రం..

Jagan’s Delhi Maha dharna: వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ మహాధర్నా పరిస్థితి ఏంటి? పొలిటికల్ మైలేజ్ కోసమే ఆయన హస్తినకు వచ్చారా? అసెంబ్లీ సమావేశాలను హాజరుకాకుండా, ఢిల్లీ ధర్నా చేపట్టడం వెనుక మతలబు ఏంటి? కేంద్రం పెద్దలు ఎందుకు ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు? చాలా వరకు మాజీ నేతలు ఎందుకు దూరంగా ఉన్నారు? ఇవే ప్రశ్నలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అరాచక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయని కోరుతూ
వైసీపీ అధినేత జగన్ బుధవారం ఢిల్లీలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వేదికగా ధర్నా జరగనుంది. వైసీపీకి చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అక్కడికి చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదువరకు జరగనుంది. ధర్నా వేదిక వద్ద ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన హత్యలకు సంబంధించి ఫోటోలను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. అయితే ఈ ధర్నాకు వైసీపీకి చెందిన కొంతమంది నేతలు హాజరుకాలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ALSO READ: ఏపీకి బడ్జెట్ కేటాయింపులపై వైసీపీ రియాక్షన్

ధర్నా నేపథ్యంలో బీజేపీ పెద్దలను కలవాలని జగన్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పటివరకు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తమకున్న పరిచయాలతో కేంద్ర పెద్దలను కలిసేందుకు ఆ పార్టీలు  తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ధర్నా ముగిసేసరికి అపాయింట్మెంట్ లభిస్తుందో లేదో చూడాలి. బీజేపీ పెద్దలు జగన్‌కు అపాయింట్మెంట్ ఇవ్వరని ఏపీ కమలనాథులు చెబుతున్నమాట. ఈ పరిస్థితి జగన్‌కు ఎందుకు వచ్చిందనే దానిపై నేతలు తలా విధంగా చర్చించుకుంటున్నారు.

ఇంకోవైపు జగన్ ధర్నాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రియాక్ట్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ధర్నాలు, నిరసనలు చేసే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందన్నారు. మంగళవారం సభలో మాట్లాడిన ఆయన, ధర్నాలో బాబాయ్‌ని ఎవరు చంపారో చెబితే బాగుంటుందని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదన్నారు. నేతలు ప్రతీకార చర్యలు పాల్పడవద్దని సభా వేదికగా తెలిపారు. అలా చేస్తే వైసీపీకి-మనకు తేడా లేకుండా పోతుందన్నారు.

జగన్ ధర్నాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు. కేవలం ఉనికి కోసం వైసీపీ ఆరాటపడుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తప్పించుకోవడం జగన్ ఈ ప్లాన్ చేశారన్నా రు. అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని, ఈ విషయంలో జగన్ ఎందుకు అసెంబ్లీకి వెళ్లలేదని ప్రశ్నించారు. మొత్తానికి జగన్ వేసిన ప్లాన్ బూమరాంగ్ అయినట్టే కనిపిస్తోంది. ధర్నా ముగిసే సరికి ఇంకెన్ని అంతర్గత విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

 

Related News

Tirumala: తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

Anantapur News: థియేటర్లలో ఓజీ ఫిల్మ్.. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వరుస ట్వీట్లు, షాకైన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్

AP DSC: DSC విషయంలో జగన్ ఓటమి, లోకేష్ గెలుపు అదే

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Big Stories

×