E-Paper
Advertisement

Balineni Srinivas Reddy : బాలినేనికి జగన్ మరో షాక్.. ఒంగోలు నుంచి చెవిరెడ్డి పోటీ?

Balineni Srinivas Reddy : వైసీపీ నేతలకు ఆ పార్టీ అధిష్టానం షాకులు మీద షాకులు ఇస్తోంది. ఈ జాబితాలో సీఎం జగన్ బంధువులు, ఆత్మీయులు కూడా ఉన్నారు. కొంతకాలంగా పార్టీ పెద్దల వైఖరితో తీవ్ర అసహనంతో ఉన్న
బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి వైసీపీ షాక్‌ ఇచ్చింది. ఒంగోలు ఎంపీ సీటు మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇచ్చేదిలేదని బాలినేనికి వైసీపీ పెద్దలు తేల్చిచెప్పారని తెలుస్తోంది.

ఒంగోలు నుంచి మరోసారి మాగుంట నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీకి దించాలని బాలినేని భావించారు. ఆయనకు సీటు ఇప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
మాగుంటకు సీటు లేకపోతే తనకు ఫోన్‌.. చేయవద్దని వైసీపీ పెద్దలకు బాలినేని అల్టిమేటం కూడా జారీ చేశారు. అయితే సీఎం పిలిచినా వచ్చేది లేదని వారితో బాలినేని తెగేసి చెప్పారని తెలుస్తోంది.

Advertisement

సోమవారం బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంవోకు వెళ్లారు. అయితే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బిజీగా ఉన్నారని చెప్పడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. తాజాగా మరోసారి సీఎంవో నుంచి బాలినేనికి ఫోన్ వచ్చింది. నెల్లూరు, ఒంగోలు కొత్త ఇన్‌ఛార్జ్‌గా.. చెవిరెడ్డిని నియమిస్తున్నామని బాలినేనికి సమాచారం ఇచ్చారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేస్తారని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో వైసీపీ పెద్దలపై బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం ఉన్నారని తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×